Guppedantha Manasu: రిషి మార్పును జీర్ణించుకోలేకపోతున్న దేవయాని.. ధరణి ముందు డ్రామా చేస్తూ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 20, 2021, 11:00 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: రిషి మార్పును జీర్ణించుకోలేకపోతున్న దేవయాని.. ధరణి ముందు డ్రామా చేస్తూ?

వసుధారా (Vasudhara) కాలేజ్ కి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని రిషి అన్న మాటలను తల్చుకుంటుంది. రిషి (Rishi) సార్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడని ఎలాగైనా ఈరోజు గట్టిగా అడగాలి అని ఫిక్స్ అవుతుంది. నిజం తెలిసింది కదా ఇప్పుడైనా ఫోన్ చేస్తే ఏమవుతుంది అని తనలో తాను అనుకుంటుంది.
 

29

మరోవైపు రిషి (Rishi) కారులో బయలుదేరుతూ వసు అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే వసుకు రిషి నుండి ఫోన్ రావడంతో వసు కట్ చేస్తూ ఉంటుంది. పదే పదే రిషి ఫోన్ చేయటంతో ఏం జరిగిందోనని లిఫ్ట్ చేస్తుంది. ఇక వసు (Vasu) కోపంతో సరిగ్గా మాట్లాడకుండా నేరుగా మాట్లాడాలని అంటుంది.
 

39

అప్పుడే వసు (Vasu) ఇంట్లో డోర్ బెల్ మోగగానే వెళ్లి డోర్ తీస్తుంది. చూసేసరికి రిషి ఉండటంతో షాక్ అవుతుంది. ఇంట్లోకి రిషి రావటంతో వసు జారి పడబోతుంటే రిషి (Rishi) వెంటనే తనను పట్టుకుంటాడు. అక్కడ కాసేపు రొమాంటిక్ గా అనిపిస్తుంది.
 

49

ఇక ఇద్దరు ఒకరి ముందు ఒకరు కూర్చుని ఉండగా ఇద్దరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి పోతారు. ఒకరికొకరు తమ మనసులో ఇంకా మాట్లాడటం లేదు అని అనుకోవడం తో ఇద్దరు ఒకేసారి మాట్లాడటం మొదలుపెడతారు రిషి (Rishi), వసు (Vasu).
 

59

రిషి (Rishi) వసును మాట్లాడమని అనడంతో వసు (Vasu) నిల్చొని వెంటనే రిషి ని హగ్ చేసుకొని తన మనసులో ఉన్న బాధ మొత్తం బయట పెడుతుంది. రిషి కూడా తనను హగ్ చేసుకున్నట్లు కనిపిస్తాడు. కానీ ఇదంతా వసు ఊహించుకుంటుంది.
 

69

రిషి పిలవడంతో వసు (Vasu) తేరుకొని ఇదంతా కల అని అనుకుంటుంది. ఏవేవో అడగాలి అని అనుకొని ఏమీ మాట్లాడలేక పోతుంది. రిషితో (Rishi) ఏమి మాట్లాడేది లేదు అని తనకు టీ పెట్టడానికి వెళ్తుంది.
 

79

రిషి ఖాళీగా ఉండటంతో వసు (Vasu) రూమ్ కు వెళ్లి అక్కడ బుక్స్ చూస్తుండగా వెంటనే వసు వచ్చి కంగారు పడుతుంది. రిషికి (Rishi) బుక్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
 

89

కాలేజీలో రిషి (Rishi) లేకపోయినా కూడా కాసేపు మీటింగ్ జరుగుతుంది. మరోవైపు దేవయాని రిషి గురించి తెలుసుకోవడానికి ధరణి (Dharani) ని పిలిచి కాసేపు ఓవర్ యాక్టింగ్ చేసి రిషి ప్రవర్తన గురించి తెలుసుకుంటుంది.
 

99

ధరణి ఫోన్ తీసుకొని రిషికి (Rishi) ఫోన్ చేయాలి అని అనుకుంటుంది. తరువాయి భాగం లో రిషికి ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగేసరికి పక్కనే వసు మాటలు వినిపించడంతో షాక్ అవుతుంది దేవయాని (Devayani).

click me!

Recommended Stories