karthika deepam: మళ్ళీ గడప దాటిన వంటలక్క.. బారసాలలో అందరిని కలుస్తానంటూ ఊహంచని షాక్?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 20, 2021, 10:24 AM IST

karthika deepam: బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
19
karthika deepam: మళ్ళీ గడప దాటిన వంటలక్క.. బారసాలలో అందరిని కలుస్తానంటూ ఊహంచని షాక్?

కార్తీక్ (Karthik) ఇంట్లో అందరూ దీపావళి పండగ జరుపుకొంటూ ఉండగా అదే సమయంలో మోనిత సౌందర్యకు ఫోన్ చేసి బాబుకు ఒంట్లో బాగోలేదని కార్తీక్ ను పంపించమని కోరుకుంటుంది. సౌందర్య ఏమీ మాట్లాడకుండా ఉండగా కార్తీక్ దీపను (Deepa) జాగ్రత్త కాల్చు దీప చీర కాలిపోతుందని అనేసరికి మోనిత ఆ మాటలు విని కోపంతో కట్ చేస్తుంది.
 

29

మోనిత (Monitha) గతంలో దీప అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతుంది. అప్పుడే ప్రియమణి (Priyamani) రావటంతో తనపై కాసేపు అరుస్తుంది. ఇక కార్తీక్ దీపను అన్న మాటలను తలచుకొని మరింత కోపంతో రగిలిపోతుంది. నన్ను పట్టించుకోవడంలేదని దీపను పట్టించుకుంటున్నాడని అనుకుంటుంది.
 

39

కార్తీక్ (Karthik) కూడా దీప మాటలను తలచుకుంటూ ఆలోచనలో పడతాడు. ఇక సౌందర్య, ఆనందరావు రావడంతో దీప ప్రవర్తన కొత్తగా ఉందని ఏదో చివరి నిర్ణయం తీసుకుంది అని మాట్లాడుతుంటారు. అప్పుడే సౌందర్య (Soundarya) మోనిత గురించి మాట్లాడటంతో కార్తీక్ తన టాపిక్ వద్దని కోపమవుతాడు.
 

49

అదే సమయంలో దీప (Deepa) పిల్లలతో సరదాగా మాట్లాడుకుంటూ వస్తుంది. పిల్లలు ఇక చాలు అమ్మ చాలా నవ్విస్తున్నావని అనడంతో సౌందర్య, కార్తీక్, ఆనందరావు అలాగే చూస్తూ ఉండిపోతారు. సౌర్య (Sowrya) తన తండ్రితో అమ్మ చాలా జోకులు వేస్తుందని అంటుంది.
 

59

పిల్లలిద్దరూ అమ్మ పుట్టినరోజని శుభాకాంక్షలు చెప్పారా అని అనడంతో దీప (Deepa) తనకు ఎప్పుడో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు అని పెద్ద గిఫ్ట్ కూడా ఇచ్చారు అని అనడంతో సౌందర్య, కార్తీక్ (Karthik) దీప మాటలు విని బాధపడతారు.
 

69

దీప (Deepa) సంతోషంగా కనిపిస్తూ సౌందర్య, ఆనంద రావుల ఆశీర్వాదాలు తీసుకుంటుంది. ఇక కార్తీక్ దీవెనలు కూడా తీసుకుంటుండగా మోనిత (Monitha) ఎంట్రీ ఇచ్చి దీపకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. మోనిత రాకను చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.
 

79

మోనిత బొకే తెచ్చి దీపకు ఇవ్వటంతో దీప సంతోషంగా తీసుకుంటుంది. ఇక దీప సంతోషాన్ని చూసి మోనిత షాక్ అవుతుంది. హిమ (Hima), సౌర్య (Sowrya) కారు దగ్గర ఉంటామని బయటకు వెళ్తారు. మోనిత అందరినీ పలకరిస్తూ ఉంటుంది.
 

89

కార్తీక్ మోనితను (Monitha) ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపో అని  అనేసరికి దీప ఏంటి డాక్టర్ బాబు వచ్చిన వాళ్ళని అలా పంపించకూడదని అనడంతో దీప (Deepa) మాటలకు మోనిత ఆలోచనలో పడుతుంది. ఇక దీప మోనిత వెటకారంగా మాట్లాడుతుంది.
 

99

మోనిత (Monitha) అందర్నీ తన బాబు బారసాల కి పిలవడంతో దీప వారందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ రేపే అసలు క్లైమాక్స్ అంటూ మోనితకు గట్టి షాక్ ఇస్తుంది. తరువాయి భాగం లో దీప (Deepa) ఇంట్లో వాళ్లందరికీ షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది.

click me!

Recommended Stories