Guppedantha Manasu: మిమ్మల్ని కాపాడలేని ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత సార్.. రిషీని కాపాడిన వసుధార!

Published : Jun 14, 2022, 10:37 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 14వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.   

PREV
16
Guppedantha Manasu: మిమ్మల్ని కాపాడలేని ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత సార్.. రిషీని కాపాడిన వసుధార!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో... వసుధార రిషీ గురించి ఆలోచిస్తూ నడుస్తుంటుంది. ఆ సమయంలోనే అక్కడే ఉన్న సాక్షి వసుధారను గమనిస్తూ అక్కడకు వస్తుంది. వసును నీ జీవితం, నీ బతుకు గురించి నాకు తెలుసు అంటూ రెచ్చగొడుతుంది. వసుదార ఎదురు సమాదానాలు చెప్పినప్పటికీ నీ గురించి నాకు అంత తెలుసు.. నువ్వు ఎంత ముండి దానివో.. ఎంత తెలివైన దానివో నాకు అన్ని తెలుసు అంటుంది. 
 

26

గతంలో నేను చెప్పినట్టు చేసావ్.. రిషి ఐ లవ్యూ చెప్తే నో చెప్పావ్.. ఇప్పుడు ఇంకొకటి చెయ్యాలి అంటూ వసుతో అంటుంది. వసు సీరియస్ లుక్ ఇచ్చినప్పటికీ అలానే మాట్లాడుతుంది. రిషికి నాకు పెళ్లి అయ్యేవరకు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళావా అంటూ అడుగుతుంది. కావాలంటే పెళ్లి అయిన తర్వాత ఇక్కడకు రా అంటూ చెప్తుంది.. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అంటూ వసు సీరియస్ అవుతుంది. 
 

36

ఎక్కువ మాట్లాడినందుకు నీకు పరిహారం కూడా ఎక్కువ ఇస్తాలే అని చెక్ ఇస్తుంది. నేను బాగా రిచ్ అంటూ చెప్తుంది. అందుకే రిషిని పెళ్లి చేసుకుంటున్న.. మేము మేము ఒక స్థాయి అంటూ అతి చేస్తుంది. అవి అన్ని విన్న వసుధార నవ్వుకుంటూ నీకు మనుషుల విలువ.. డబ్బు విలువ తెలియదు అంటుంది. ఎటో రిషిని కాదు అన్నావ్ కదా నీకు ఎందుకు అంటుంది సాక్షి. 
 

46

నువ్వు రిషి సర్ గురించి మాట్లాడద్దు.. నీకు ఆ పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు.. అసలు నువ్వు కాలేజ్ ఏండి కావాలి అని ఎలా అనుకున్నవి.. నీకు ఏం అర్హత ఉందని రిషి సర్ వెంట పడుతున్నావ్ అని రివర్స్ కౌంటర్ ఇస్తుంది వసు..  డబ్బులు ఒకటే ఉంటే సరిపోదు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. 
 

56

ఆతర్వాత సీన్ లో కాలేజ్ కెమికల్ ల్యాబ్ లో పొగలు వస్తున్నాయ్.. స్టూడెంట్స్ అందరూ అందులోనే ఉన్నారు.. రిషి సర్ కూడా అక్కడే ఉన్నారు అని చెప్పగా.. వసుధార షాక్ అయి పరిగెడుతుంది. అటువైపు ల్యాబ్ లో స్టూడెంట్స్ ను బయటకు పంపిస్తుంటాడు. అలా పంపించిన సమయంలో రిషి అక్కడే ఉండిపోతాడు. ఆ సమయంలోనే వసుధార రిషిని కాపాడటానికి వెళ్తుంది. 
 

66

అంత సీన్ లో కూడా వసుతో రిషి ప్రేమ విషయం మాట్లాడటం కామెడీ.. పో వసుధార నువ్వెందుకు వచ్చావ్ అంటే.. మీకు ఏమైనా జరిగితే నేను బతకలేను అంటుంది.. వసును  వెళ్ళిపో అంటాడు.. మిమ్మల్ని రక్షించుకోలేని ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత అని అంటూ రిషిని వసుధార చున్నీ కట్టి బయటకు తీసుకువస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. 
 

click me!

Recommended Stories