అవి చిన్నవిగా ఉన్నాయని మూవీ నుండి తీసేశారు... బాలయ్య హీరోయిన్ రాధికకు చేదు అనుభవం!

Published : Jun 14, 2022, 07:47 AM IST

బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆఫ్టే సంచలన కామెంట్స్ చేశారు. శరీరంలోని ప్రైవేట్ పార్ట్శ్ చిన్నవిగా ఉన్నాయనే కారణంతో ఆమెను ఓ సినిమా నుండి తప్పించారట. నా అనుకున్న వాళ్ళే ఇలా చేయడంతో చాలా బాధపడ్డానని ఆమె షాకింగ్ విషయాలు వెల్లడించారు.

PREV
17
అవి చిన్నవిగా ఉన్నాయని మూవీ నుండి తీసేశారు... బాలయ్య హీరోయిన్ రాధికకు చేదు అనుభవం!

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte)వెండితెరపై చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కెమెరా ముందు ఏకంగా నగ్నంగా నటించిన గట్స్ ఆమె సొంతం. ది వెడ్డింగ్ గెస్ట్ మూవీలో రాధికా ఆఫ్టే పూర్తి నగ్నంగా నటించారు. అప్పట్లో ఇదో పెద్ద వివాదమైంది. రాధికా పతాక శీర్షికలకు ఎక్కారు.

27

అలాగే లస్ట్ స్టోరీస్ యాంతాలజీ సిరీస్లో సైతం ఆమె బోల్డ్ రోల్ చేశారు. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా ప్రసారమైన లస్ట్ స్టోరీస్ సిరీస్ సూపర్ సక్సెస్ కాగా... కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, మనీషా కొయిరాలా సైతం నటించారు. తెలుగులో నాలుగైదు చిత్రాలు చేసిన రాధికా టాలీవుడ్ ఆడియన్స్ కుడి కూడా పరిచయమే.

37


ప్రకాష్ రాజ్, ఆకాష్ పూరి ప్రధాన పాత్రలు చేసిన ధోని చిత్రంలో రాధికా ఆఫ్టే నటించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్త చరిత్ర 1, 2 చిత్రాల్లో ఆమె నటించడం జరిగింది. రాధికాకు ఫేమ్ తెచ్చిపెట్టిన మూవీ మాత్రం లెజెండ్. 2014లో విడుదలైన లెజెండ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ మూవీలో రాధికా ఆఫ్టే సోనాల్ చౌహాన్, నమితతో పాటు ఓ హీరోయిన్ గా నటించారు. 
 

47

కాగా పరిశ్రమలో హీరోయిన్స్ ఎంపిక ఎలా ఉంటుందో? తనకు ఎదురైన చేదు అనుభవం ద్వారా వెల్లడించారు. కేవలం ఎద భాగం, పెదాలు చిన్నవిగా ఉన్నాయని ఓ మూవీ ఆఫర్ చేజారిందట. నీకు అవి చిన్నవిగా ఉన్నాయి, అందుకే ఈ సినిమాకు నిన్ను తీసుకోవడం లేదన్నారట. ఆ ఆఫర్ ఎద భాగం, పెదవులు పెద్దవిగా ఉన్న మరో హీరోయిన్ కి ఇచ్చారట. 
 

57

దానికి కారణం అవి పెద్దవిగా ఉన్న ఆమె సెక్సీగా కనిపిస్తుంది. ఆమెకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అన్నారట. ఆ సంఘటన రాధికా ను షాక్ కి గురిచేసిందట. అందులోనూ నమ్మినవాళ్ళు, మన అనుకున్నవారు ఇలా చేయడంతో చాలా బాధేసిందని రాధికా ఆఫ్టే చెప్పుకొచ్చారు.

67


అలాగే కెరీర్ బిగినింగ్ లో చాలా మంది తనకు సర్జరీలు సూచించినట్లు రాధికా వెల్లడించిన విషయం తెలిసిందే. తన శరీర భాగాలైన ఎద, పిరుదులు, కాళ్ళు, బుగ్గలు, ముక్కుకు పలువురు, పలు సందర్భాల్లో సర్జరీలు చేయించుకో అని సూచించారని రాధికా చెప్పారు. కానీ నేను దానికి ఇష్టపడలేదని రాధికా ఆఫ్టే తెలియజేశారు. తన శరీరం ఎలా ఉన్నా నేను ఇష్టపడతానని ఆమె వెల్లడించారు. 

77


సెక్సీగా, అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ సర్జరీలు చేయించుకోవడం చాలా సాధారణం. కానీ రాధికా మాత్రం కనీసం ఇంజక్షన్స్ కూడా తీసుకులేదట. తన జుట్టుకు రంగు వేసుకోవడానికి కూడా ఆలోచిస్తానని రాధికా చెప్పుకొచ్చారు. ముక్కుసూటిగా ఉండే రాధికా బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ కలిగి ఉన్నారు. 

click me!

Recommended Stories