రిషి ముందు కన్నీళ్లు పెట్టుకున్న వసుధర.. భయంతో వణికిపోతున్న దేవయాని!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 22, 2021, 11:26 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దుసుకుపోతుంది. 

PREV
17
రిషి ముందు కన్నీళ్లు పెట్టుకున్న వసుధర.. భయంతో వణికిపోతున్న దేవయాని!

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్ తో దుసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏమిటో చూద్దాం.
 

 

27

వసుని (Vasu) బోర్డ్ పై ప్రాబ్లం సాల్వ్ చేయమని రిషి అడగటంతో వసు మాత్రం సారీ సార్ అంటూ రాస్తుంది. దీంతో రిషి (Rishi) వచ్చి తనపై అరవడంతో క్లాస్ వాళ్ళందరూ గుసగుసలాడుతారు. వసు చాలా బాధ పడుతుంది.
 

37

మరోవైపు దేవయాని (Devayani) రిషి ఏమైనా అంటాడేమో అని టెన్షన్ పడుతుంది. అంతలోనే ధరణి రావడంతో ధరణి (Dharani) పై అరుస్తుంది. ఇక ఫణేంద్ర వర్మ రావడంతో ఆయనపై కూడా అరుస్తాడు. తనను జగతి అడ్డంగా బుక్ చేసిందని బాగా కోపంతో రగిలిపోతుంది.
 

47

ఇక వసు (Vasu) ఒంటరిగా ఉండటంతో మహేంద్ర వర్మ (Mahendra Varma) వచ్చి మాట్లాడుతాడు. తనకు శిరీష్ విషయంలో సలహా ఇవ్వమని కోరుకుంటుంది. ఎమ్ జరిగిందో అని మహేంద్ర వర్మ అడగటంతో తర్వాతకు చెబుతా అని అంటుంది. ఇక ఈ మాటలన్నీ రిషి పక్కన ఉండి వింటాడు.
 

57

అదే సమయంలో వసుకి శిరీష్ (Sirish) ఫోన్ చేసి తనను కలవమంటాడు. ఇక కాలేజ్ దగ్గరికి శిరీష్ వచ్చి కార్లో ఎదురుచూస్తుండగా వసు శిరీష్ దగ్గరికి వెళుతుంది. వసు వెళ్లాడని చూసి రిషి (Rishi) కారు హారన్ కొట్టడంతో రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి కూడా తనను కారులో ఎక్కమని అంటాడు.
 

67

మరోవైపు శిరీష్ కూడా కారులో హారన్ కొడుతూ పిలుస్తాడు. ఇక రిషి కోపంతో ఎక్కడికి వెళ్తావు డిసైడ్ చేసుకో అనడంతో శిరీష్ కి తర్వాత కలుస్తానని చెప్పి రిషి (Rishi) కారులో వెళ్తుంది. ఇక శిరీష్ చాలా ఫీల్ అవుతాడు. రిషి, వసు (Vasu) ఓ చోట కి వెళ్లి మాట్లాడుకుంటారు.
 

77

వసు (Vasu).. రిషితో మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అవుతుంది. తనపై ఉన్న అభిమానం గురించి వివరిస్తుంది. రిషి (Rishi) కూడా వసు తో కాస్త ఫీల్ అవుతూ మాట్లాడుతాడు. ఎప్పుడు పక్కనే ఉండమని మనమధ్య విద్యా బంధం ఉందని చెబుతాడు.

click me!

Recommended Stories