చిరునవ్వులతో కవ్విస్తోన్న స్నేహా, బ్లూ డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తున్న బ్యూటీ..

First Published Dec 20, 2022, 8:45 AM IST

ఈమధ్య సోషల్ మీడియాల ఎక్కువగా సందడి చేస్తోంది..హోమ్లీ బ్యూటీ స్నేహా. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటినుంచీ..సినిమాల్లో కంటే..సోషల్ మీడియాలోనే ఎక్కువ హడావిడి చేస్తుంది. 

సీనియర్ హీరోయిన్ స్నేహా.. సెకండ్ ఇన్నింగ్స్ లో సోషల్ మీడియా మీద బాగా కాంన్సంట్రేట్ చేసింది. అదరిపోయే ఫోటో షూట్స్ తో ఔరా అనిపిస్తోంది. అప్పుడప్పుడు గ్లామర్ డోస్ పెంచుతూ.. మతిపొడొడుతోంది. 

కాస్త ఘాటుగా... కొంచెం స్వీట్ గా.. చూడటానికి మాత్రం పద్దతిగా.. తన మార్క్ ఫోటో షూట్స్ తో స్నేహా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.  స్నేహ.  కెమెరాకు అదిరిపోయేలా స్టిల్స్ ఇస్తోంది. 

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా మంచి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సావిత్రి, సౌందర్య తరువాత ఆ టైప్ హీరోయిన్ అనిపించుకున్నది స్నేహా ఒక్కరే. స్నేహా  ఫిల్మ్ జర్నీలో స్కిన్ షోకి పెద్దగా ఛాన్స్ ఇవ్వకుండా హోమ్లీ హీరోయిన్ అన్న పేరు తెచ్చుకుంది.
 

ఒక వేళ సిల్వర్ స్క్రీన మీద కాస్త హాట్ గాకనిపించాల్సి వచ్చినా.. తన హద్దుల్లో ఉంటూ.. వల్గారిటీ లేకుండా.. చూసుకుంటుంది బ్యూటీ. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచీ.. పెళ్లై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ఇప్పటి వరకూ స్నేహా అదే మార్క్ ను కంటీన్యూ చేస్తుంది. 

ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న టైమ్ లోనే.. . యాక్టర్ ప్రసన్నన్నను పెళ్లాడింది.ఇద్దరు పిల్లలు.. ఫ్యామిలీ లైఫ్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. ఈ రెండు మూడేళ్ల క్రితం నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది స్నేహా.. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తోంది. 

రీసెంట్ గా స్నేహా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారని.. వారి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ రూమర్స్ తెగ తిరిగాయి. వాటికి ఒక్క ఫోటోతో సమాధానం చెప్పేసింది స్నేహా. భర్తతో క్లొజ్ గా మూవ్ అవుతు..ప్రేమగా ఉన్న ఫోటోను శేర్ చేసింది. దాంతో రూమర్స్ కు చెక్ పెట్టినట్టు అయ్యింది. 

అవకాశాల కోసం చూస్తుంది స్నేహా. అయితే తనకు తగ్గ పాత్ర వస్తేనే చేస్తానంటోంది. ఏదో ఒక సినిమా చేసేయాలి అనే ఆలోచన తనకు లేదు అంటోంది. అందుకే  అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది స్నేహ. సోషల్ మీడియాలో మాత్రం రెగ్యూలర్ గా దుమ్ము రేపుతోంది. 
 

ఎక్కువగా ఫ్యామిలీ, పిల్లలకే ఎక్కువగా టైమ్‌ని కేటాయిస్తుంది స్నేహా .. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తోంది. భర్త ప్రసన్నతో కలిసి కొన్నియాడ్ ఫిల్మ్స్ కూడాచేస్తోంది బ్యూటీ. సినిమాలతో బిజీ అయిపోవాలనిలేదంటోంది. 

ఇక స్నేహా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వెంటనే రామ్‌చరణ్‌ హీరోగా వినయ విధేయ రామ సినిమాలో నటించింది. కీలక పాత్రలో మెప్పించింది. అంతకు ముందు అల్లు అర్జున్‌ హీరోగా నటించిన  సన్నాఫ్‌ సత్యమూర్తి లో ఉపేంద్రకి జోడిగా మెరిసింది స్నేహ. ప్రస్తుతం కొన్నిసినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 
 

click me!