తర్వాత చదువుల పండుగ మీటింగ్ రూమ్ లో అందరూ రిషిని, ప్రోగ్రాం ఘనవిజయం సాధించినందుకు అభినందిస్తూ ఉంటారు. అప్పుడు సాక్షి ,రిషి కి చాలా మెసేజ్ లు పంపుతాది. కానీ రిషి వాటిని చదవడు. ఈలోగ వసుధార, ఆ గిఫ్ట్ ని బ్యాగ్ లో పెట్టి ,"ఈరోజు ఎలాగైనా రిషి సార్ కి ఆ గిఫ్ట్ ని ఇవ్వాలి" అని అనుకుంటుంది. చదువుల పండుగ మీటింగ్ లో మహేంద్ర, రిషిని పొగుడుతూ కొన్ని వాక్యాలు చెప్తాడు.