అప్పుడు సౌర్య వాళ్ళ తాతయ్య సౌర్యని తనతో పాటు జాగింగ్ కి రమ్మని పిలుస్తాడు. సౌర్య ముందు వద్దన్నా తర్వాత వెళుతుంది. సౌర్య వాళ్ళ తాతయ్య, ఇద్దరూ జాగింగ్ కి వెళ్తారు. అక్కడ శౌర్య వాళ్ళ తాతయ్య, సౌర్యకి ఎదుటివారిని మనసుతో అర్థం చేసుకోవాలి అని కొన్ని జీవిత సత్యాలు హితబోధిస్తాడు. తర్వాత నిరూపమ్, సౌందర్య దగ్గరికి వచ్చి కొంచెం సేపు సరదాగా మాట్లాడుతాడు. అలాగే శౌర్య ,హిమల చిన్నప్పటి స్నేహం గురించి అడుగుతాడు.