Guppedantha Manasu: అందమైన క్షణాలను గడిపిన వసు, రిషి.. ఒకే కారులో ప్రయాణించిన తల్లి, కొడుకు?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Nov 25, 2021, 12:38 PM IST

Guppedantha Manasu:బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమౌతున్న ఈ సీరియల్ రేటింగ్ మొదటి స్థానంలో దూసుకెళుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
110
Guppedantha Manasu: అందమైన క్షణాలను గడిపిన వసు, రిషి.. ఒకే కారులో ప్రయాణించిన తల్లి, కొడుకు?

వసు (Vasu) ఎగ్జామ్ రాయటంతో రిషి (Rishi) వసును కారులో పిక్ అప్ చేసుకొని బయలు దేరుతాడు. రిషి వసును రెస్టారెంట్ లో జాబ్ చేయటం లేదా అని అడగటంతో ఎగ్జామ్స్ అయ్యాక జాబ్ లో జాయిన్ అవుతానని అంత వరకు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతానని అంటుంది.
 

210

ఎగ్జామ్ తర్వాత హాలిడేస్ లో మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ ఉంటుందని ఆ సమయంలో ఎక్కడికి వెళ్లొద్దని వసు (Vasu) తో చెబుతాడు రిషి (Rishi). అలా కాసేపు సరదాగా మాట్లాడుతూ ప్రయాణిస్తూ ఉండగా వసు వెంటనే ఏదో పూనకం వచ్చినట్లు కారు ఆపిపిస్తుంది.
 

310

వాసన పీల్చుకుంటూ మిర్చి వాసన వస్తుంది అని రిషితో అంటుంది. రిషి (Rishi) మాత్రం వసు (Vasu) ప్రవర్తన చూసి ఏమి అనలేక పోతాడు. మొత్తానికి మిర్చి తినాలన్నా ఉద్దేశంతో రిషిని అక్కడికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
 

410

కారు దిగగానే రిషి (Rishi) వసుకు (Vasu) కొన్ని కండిషన్లు పెడతాడు. అక్కడికి వెళ్లాక మిర్చి పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడకుండా ఉండమంటాడు. ఇక మిర్చి బండి దగ్గరికి వెళ్ళాక అక్కడ ఆ వాతావరణం బాగా ఆస్వాదిస్తుంది.
 

510

రిషిని (Rishi) కూడా ఆ వాతావరణంను ఆస్వాదించమంటుంది. రిషి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటాడు. వసు (Vasu) మాత్రం తన పల్లెటూరి రూపాన్ని బయట పెడుతుంది. రిషికి మిర్చి గురించి వివరిస్తూ ఎలా తినాలో చెబుతుంది. మొత్తానికి అక్కడ కాసేపు సరదాగా గడుస్తుంది.
 

610

రిషి (Rishi) వసు (Vasu) సంతోషం చూసి ఇంతా సంతోషంగా ఉండటానికి కారణమేంటి అని అడుగుతాడు. ఇక మధ్యతరగతి కుటుంబం ఇలాగే ఉంటుంది అని మధ్యతరగతి కుటుంబం గొప్పతనం గురించి వివరిస్తుంది.
 

710

అలా వసును (Vasu) తన కారులో ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు.  వసు రిషిని ఇంట్లోకి రమ్మంటుంది. కానీ రిషి వెళ్లకుండా కాస్త కోపంగా మాట్లాడినట్లు కనిపించటంతో.. నేను ప్రతి ఒక్క విషయంలో ఇలానే ఉంటాను అని తన వ్యక్తిత్వం గురించి చెబుతాడు రిషి (Rishi).
 

810

తన మనసులో ఇంతవరకు ఏ పొరపాటు చేయలేదు అని శిరీష్ (Sireesh) విషయంలో మాత్రమే అలా ప్రవర్తించాను అని అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరుతాడు. వసు ఇంట్లోకి వెళ్తుండగా జగతి (Jagathi) చూసి కాసేపు రిషి గురించి మాట్లాడుతుంది.
 

910

రిషి (Rishi) కారులో వెళ్తూ వసు గురించి ఆలోచిస్తాడు. ఉదయాన్నే ఫణీంద్ర వర్మ, మహేంద్ర వర్మ కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. ధరణి (Dharani) తో దేవయాని వ్యక్తిత్వం గురించి ఫణీంద్ర ఓపెన్ గా చెబుతాడు. రిషితో కొన్ని విషయాలు పంచుకుంటారు.
 

1010

తరువాయి భాగంలో మహేంద్ర వర్మ (Mahendra), వసు లు మాట్లాడుతుండగా  జగతి, రిషి ఒకే కారులో వస్తారు. ఇక అది చూసిన మహేంద్రవర్మ, వసు (Vasu) షాక్ లో ఉంటారు.

click me!

Recommended Stories