ఆ తర్వాత జగతి,వసుధర ఇద్దరు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. నేను ఇప్పుడు రిషి సార్ ని వెళ్లి అసలు ఏమైందో కనుక్కుంటాను అని వసు అనగా జగతి ఇది సమయం సందర్భం కాదు. రిషికి ఇప్పుడు మూడు బాలేదు చాలా కోపంగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో మాట్లాడడం మంచిది కాదు అని అంటుంది.అప్పుడు వసుధార, తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు చెప్పడం మన బాధ్యత కదా మేడం అని అనగా, ఇది బాధ్యతలు గురిం,చి హక్కుల గురించి అడిగే సమయం కాదు అని నచ్చచెప్పుతుంది జగతి.