ఈ పెళ్లి నేను ఎలాగైనా చెడగొడతాను. కంగారు పడొద్దు నాతో రండి అని అంటుంది శౌర్య. దాని తర్వాత సీన్లో శోభ పెళ్లి దుస్తుందో ఫోటోలు తీసుకుంటూ ఈ పెళ్లి జరిగితే నా హాస్పిటల్ అప్పులన్నీ తీరిపోతాయి అని ఆనందపడిపోతూ ఉంటుంది. ఈలోగా శౌర్య, హిమ, సౌందర్య ,ఆనంద్ రావు అక్కడికి వస్తారు. వాళ్లతో పాటు శౌర్య గతంలో తనని కిడ్నాప్ చేసిన వాడిని కూడా లాక్కొని వస్తుంది. శౌర్య, స్వప్న వాళ్ళందరినీ పిలిచి వాడి చేత నిజం చెప్పిస్తుంది. అయినా సరే స్వప్న మనసు కరగదు.