ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. మరి లేకపోతే ఏంటి వసుధార, తను అలా అంటున్నాడు కానీ దాని వెనక రీజన్ ఏదో ఉంది. అది ఏంటో చెప్తే సరిపోతుంది కదా అంటుంది ఏంజెల్. ఆయనని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది వసుధార. అలా ఏమీ లేదు కానీ బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటే లైఫ్ కంఫర్ట్ గా ఉంటుంది కదా అందుకే అంటుంది ఏంజెల్. సరే అయితే ఒక పని చేద్దాం, రిషి సర్ ని ఎనాలసిస్ చేద్దాం అంటూ పాజిటివ్స్, నెగిటివ్స్ రాసి ఏంజెల్ కి ఇస్తుంది వసుధార.