
టీవీ నటి ప్రియాంక తొలి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ తెలుగు 7హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. `పొట్టి పిల్లా` అనే సాంగ్‌తో ఆమె కిర్రాక్ పర్‌ఫెర్మ్ చేసింది. అందరి మనసులు దోచుకుంది. ఇందులో ఆమె హౌజ్‌ని అందరికి పరిచయం చేయాలని ఆమెకి హోస్ట్ నాగార్జున తెలిపారు. ఆమె హౌజ్‌లోకి వెళ్లి అన్నింటిని చూపించే ప్రయత్నం చేసింది. కాకపోతే హౌజ్‌లో పెద్ద ట్విట్ట్ ఇచ్చాడు. అన్ని కంటెస్టెంట్లు సాధిస్తేనే ఆయా సౌకర్యాలు అందుతాయని తెలిపారు. హౌజ్ మొత్తం ఎమ్టీ గా ఉంచారు. ఆమెకి ఓ సూట్‌కేసు ఇచ్చి పంపించాడు. అలాగే పవర్ అస్త్ర గురించి చెప్పారు. దాన్ని సాధిస్తేనే కంటెస్టెంట్లగా ఫైనల్ అవుతారని తెలిపారు నాగ్.
బిగ్ బాస్ తెలుగు 7 షోకి రెండో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు శివాజీ. తన లైఫ్ కూడా ఉల్టా ఫుల్టా అయ్యిందని తెలిపారు శివాజీ. తన తొలి చెక్ నాగార్జున చేతుల మీదుగానే అందుకున్నానని, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. తొలి సినిమాకి ఎక్స్ ట్రా రెమ్యూనరేషన్ ఇవ్వడంతో ల్యాండ్ కొన్నట్టు తెలిపారు శ కొత్త ఎక్స్ పీరియెన్స్ చేద్దామని తాను వచ్చినట్టు చెప్పాడు శివాజీ.
మూడో కంటెస్టెంట్‌గా పాపులర్ సింగర్ దామిని ఎంట్రీ ఇచ్చింది. `ఎల్‌పచీనో..` అంటూ తనదైన స్టయిలీష్ సాంగ్‌తో ఆమె ఎంట్రీ ఇచ్చాడు. పాటలతో ఉర్రూతలూగించారు. దామినికి పెద్ద షాకిచ్చాడు నాగార్జున. ఆమె కంటెస్టెంట్‌గా ఇంకా ఫైనల్ కాలేదని, కంటెస్టెంట్ అయ్యే అర్హత సాధించాలన్నారు. పవర్ అస్త్రాని సొంతం చేసుకుంటే కంటెస్టెంట్‌గా ఛాన్స్ వస్తుందన్నారు. అలాగే హౌజ్‌లో ఒక ట్రెజర్ ఉందని, దాన్ని దక్కించుకుంటే దానిబెనిఫిట్స్ అన్ని వస్తాయని తెలిపారు. ఈ విషయం ఆమెకి మాత్రమే చెబుతున్నట్టుగా నాగ్ తెలియజేశారు. నాగ్ చెప్పిన దానికి పెద్ద షాక్ అయ్యింది.
నాల్గో కంటెస్టెంట్‌గా ఆర్టిస్ట్ మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చారు. తనదైన పర్‌ఫెర్మెన్స్ తో అదరగొట్టారు. షర్ట్ విప్పి ఆయన హౌజ్‌లోకి వెళ్లడం విశేషం. సిక్స్ ప్యాక్‌తో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఐదో కంటెస్టెంట్‌గా లాయర్, నటి శుభ శ్రీ రాయగురు ఎంట్రీ ఇచ్చారు. `చూసే చూసే.. ` అనే పాటతో పర్‌ఫెర్మ్ చేసి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన డాన్సుతో అదరగొట్టింది. రెడ్ డ్రెస్‌లో ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఈమెకి కూడా కంటెస్టెంట్ ఫైనల్ కాలేదని, అర్హత సాధించాలని,అందుకు పవర్ అస్త్రాని గెలుచుకోవాలని తెలిపారు నాగార్జున.
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోకి శృంగార నటి షకీలా ఎంట్రీ ఇచ్చారు. ఆరో కంటెస్టెంట్‌గా ఆమె ఎంట్రీ ఇవ్వడం విశేషం.తన కన్నీటి గాథ చెబుతూ ఆమె ఏవీని చూపించారు. అనంతరం తన 25ఏళ్ల కెరీర్ ఒకటి,ఇప్పుడు ఒకటి అని, ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కి దగ్గర కావాలని షోకి వచ్చినట్టు తెలిపింది. ఇప్పుడు షకీ అమ్మగా వచ్చినట్టు తెలిపింది. అంతేకాదు తాను దత్తత తీసుకున్న ఇద్దరు ట్రాన్స్ జెండర్లని పరిచయం చేశారు నాగ్. తమని సొంత అమ్మలా షకీలా ఉంటుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా షకీలా కన్నీళ్లు పెట్టుకున్నారు. 25ఏళ్ల క్రితమే ఈ ఆలోచన వచ్చిందన్నారు. వారికి అమ్మ అవసరం ఉందని, అందుకే దత్తత తీసుకున్నట్టు తెలిపింది షకీలా.
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోకి ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్, డాన్సర్ సందీప్ ఎంట్రీ ఇచ్చారు. వారసుడు చిత్రంలోని దళపతి సాంగ్‌తో ఆయన బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆద్యంతం స్టయిలీష్ డాన్సుతో అదరగొట్టాడు. తన లైఫ్‌లో కొరియోగ్రాఫర్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని, కానీ తండ్రిగా ఉండటం గొప్ప ఫీలింగ్ అని తెలిపాడు సందీప్.
బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా `కార్తీక దీపం` నటి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే డాన్స్ పర్‌ఫెర్మ్ తో ఎంట్రీ ఇచ్చింది. అందంతో అదరగొట్టింది. కార్తీక దీపం సీరియల్‌లో మోనితగా ఆమె నెగటివ్ రోల్ చేసి మెప్పించింది. ఫిజికల్‌గా తాను ఎప్పుడూ ఫిట్‌గా ఉంటానని తెలిపింది. అంతేకాదు నాజూకు అందంతో ఆకట్టుకుంది. అయితే తనని టెలివిజన్ రమ్యకృష్ణ అని పిలిచేవారట. అలా తాను మెప్పించాలని కోరుకుంటున్నట్టు , ఆ కంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. అయితే అందులోనే ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. హౌజ్‌లో ఎవరిచేత నువ్వు బ్యూటీఫుల్, హాట్ అనే కంప్లిమెంట్లు తీసుకోవద్దని, అలా కంప్లిమెంట్స్ వస్తే ఫనిష్‌మెంట్ ఇస్తానని తెలిపారు నాగ్.
బిగ్ బాస్ 7 హౌజ్‌లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ `టేస్టీ` తేజ ఎంట్రీ ఇచ్చారు. వంటల వీడియోలతో పాపులర్ అయ్యాడు తేజ. వంటకాలను టేస్టీ చేస్తూ వాటిని తన యూట్యూబ్ ద్వారా జనాలకు పరిచయం చేస్తాడు. ఆడియెన్స్ కి కూడా తనటేస్ట్ ని చూపిద్దామని బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చినట్టు చెప్పాడు. ఈ సందర్భంగా స్టేజ్‌పైనే తేజకి టాస్క్ ఇచ్చాడు నాగ్.
బిగ్ బాస్ 7 హౌజ్‌లోకి హీరోయిన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రతిక పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. తనకు నటిగా గుర్తింపు రావడం లేదు, ఐడెంటిటీ కోసం బిగ్ బాస్ లోకి వెళ్తున్నట్టు రతిక చెప్పింది. హౌజ్‌లో తన టాలెంట్ చూపిస్తానని పేర్కొంది. తన డన్సర్, ఇమిటేట్ ఆర్టిస్ట్ కూడా అని పేర్కొంది. అయితే తన హార్ట్ బ్రేక్ అయ్యిందని చెప్పాడు నాగ్. ఆమె లవ్ ఫెయిల్యూర్ అయ్యిందనే విషయాన్ని వెల్లడించడంతో ఆమె ఆశ్చర్యపోయింది.
బిగ్ బాస్ హౌజ్‌లోకి పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన డాక్టర్ నుంచి యాక్టర్ అయ్యారు. చిన్నప్పట్నుంచి తనకు రైటర్, డైరెక్టర్ కావాలనుకున్నారట. కానీ పేరెంట్స్ స్టడీస్ చేయమని చెప్పడంతో చదువుకుని డాక్టర్ అయ్యాడట. కానీ తన ప్లాన్ బీ సినిమాలు. అలా డాక్టర్ అయ్యాడు యాక్టింగ్ సైడ్ వెళ్లాడట. హీరోగానూ నటించాడు. అయితే బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాక అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేయాలని, అందుకు తనకు బేడీలు ఇచ్చి పంపించాడు నాగార్జున.
పన్నెండో కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ లోకి నటి కిరణ్ రాథోర్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించిన ఆమె బిగ్ బాస్ హౌజ్‌లోకి రావడం విశేషం. తనకు ఈ మధ్య గ్యాప్ వచ్చిందని, తానేంటో నిరూపించుకునేందుకు, తన ప్రతిభని చూపించేందుకు బిగ్ బాస్ బెటర్ ప్లాట్ ఫామ్ అని భావించిన వచ్చినట్టు తెలిపింది కిరణ్ రాథోర్.
బిగ్ బాస్ హౌజ్‌లోకి రైతు బిడ్డ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్ పదమూడో కంటెస్టెట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అవమానాలను అధిగమించి రైతుగా నిలబడ్డానని తెలిపారు. అమ్మానాన్నలకు అండగా నిలిచినట్టు తెలిపారు. అంతేకాదు రైతులకు సంబంధించిన విషయాలను యూట్యూబ్ ద్వారా చెబుతూ పాపులర్ అయ్యారు. కలర్ విషయంలో తాను ఎన్నో అవమానాలు ఫేస్ చేశానని, తాను ఎలాగైనా బిగ్ బాస్ హౌజ్‌లోకి వెళ్లాలని కష్టపడినట్టు తెలిపారు. అంతేకాదు నాగార్జున కోసం బియ్యం, మట్టి గిఫ్ట్ గా తీసుకొచ్చాడు. నాగ్ కూడా అతనికి మిర్చీ మొక్క ఇచ్చాడు. దాన్ని పెంచి కాయలు కాసేలా చేయలన్నారు. అలా చేస్తే చాలా బెనిఫిట్స్ ఇస్తానని పేర్కొన్నాడు.
టీవీ నటుడు అమర్ దీప్ 14వ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డాన్సు పర్‌ఫెర్మ్ తో ఆయన ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ఆయన్ని నాగార్జున ప్రత్యేకంగా అభినందించాడు. అదేసమయంలో తన భార్య తేజూని చాలా మిస్ అవుతున్నట్టు చెప్పాడు అమర్ దీప్.
మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్లని పరిచయం చేశాడు నాగ్. మిగిలిన వారిని రేపు పరిచయంచేసే అవకాశం ఉంది. అయితే వీరితోపాటు హీరో నవీన్ పొలిశెట్టిని కూడా హౌజ్‌లోకి పంపించి ట్విస్ట్ ఇచ్చాడు. కాసేపు ఆయన హౌజ్‌లో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది. రేపు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక బిగ్ బాస్ షో స్టార్ మాలో ప్రసారం కానుంది. రాత్రి 9.30 గంటలకు ఈ షో టెలికాస్ట్ అవుతుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో లైవ్‌లో ప్రసారం కానుంది. 15 వారాలపాటు ఈ షో కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి అంతా ఉల్టా పుల్టా ఉండబోతుందట. అదే ఎగ్జైటింగ్‌గా ఉంది. మరి ఏం కొత్తదనం చూపిస్తారనేది చూడాలి.