Guppedantha Manasu: రిషి, వసులను దూరం చేస్తున్న దేవయాని.. పాపం అవమానం తట్టుకోలేకపోతున్న రిషి!

Published : May 05, 2022, 09:33 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: రిషి, వసులను దూరం చేస్తున్న దేవయాని.. పాపం అవమానం తట్టుకోలేకపోతున్న రిషి!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి వసు (Vasu) చేసిన వంటలు తింటూ అందంగా పొగుడుతూ ఉంటాడు. ఒక పక్క ఇంటి పక్కన ఆవిడ వీళ్లిద్దరు కలిసి అన్నం తినడం చూసి వీళ్ళేంటి భోజనం వరకు వచ్చారా అని అనుకుంటుంది. అంతేకాకుండా వీళ్లకి ఇల్లు ఇచ్చి తప్పు చేసామేమో అని ఇరుగుపొరుగు అనుకుంటారు. ఇక అన్నం తిన్న తర్వాత రిషి (Rishi) వెళ్ళిపోతాడు.
 

26

ఇక ఇంటి పక్కన ఆవిడ వసు దగ్గరకు వచ్చి ఆయన ఎవరు ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వెళుతున్నాడు అని అడుగుతుంది. అంతేకాకుండా ఈ కథలు ఏంటి అని అడుగుతుంది. ఇక ఆవిడ మాటలు తట్టుకోలేక వసు (Vasu) బాధపడుతూ ఉంటుంది. ఇంతకు ఆ ఆవిడ ఎవరంటే? దేవయాని (Devayani) వాళ్ళిద్దర్నీ విడదీయడానికి ఏర్పాటు చేసిన మనిషి.
 

36

ఇక దేవయాని (Devayani) బస్తీలో ఆమెకు ఫోన్ చేసి ఎక్కడ వరకు వచ్చింది అని అడుగుతుంది. జరిగిన విషయం తెలిసిన నవ్వుతూ ఉంటుంది. అది గమనించిన ధరణి మా అత్త గారు గారు నవ్వుతూ ఉన్నారంటే.. ఎవరికో కీడు జరుగుతుంది అని అనుకుంటుంది. మరోవైపు రిషి (Rishi) వర్కౌట్లు చేస్తూ గౌతమ్ సాక్షి గురించి మాట్లాడినందుకు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు.
 

46

ఆ తర్వాత సాక్షి రిషి (Rishi) కి ఫోన్ చేయగా..  రిషి ఆ ఫోన్ మాట్లాడకుండా ముఖం మీదనే కట్ చేస్తాడు. ఈలోపు జగతి వాళ్ల కోసం జ్యూస్ తీసుకుని రాగా రిషి ఆ జ్యూస్ తీసుకోడు. దాంతో జగతి మనసులో ఎంతో బాధ పడుతుంది. ఇక రిషి వసు (Vasu) కు ఫోన్ చేయగా మీకేం పనిలేదా ఎందుకు అస్తమానం ఫోను చేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని విరుచుకు పడుతుంది.
 

56

నిజానికి ఫోన్ చేసింది రిషి (Rishi) అని తెలియక తర్వాత గ్రహించుకొని రిషి కి సారీ చెబుతుంది. ఇక వసు రిషిలు బ్రేక్ఫాస్ట్ చేయడానికి తను పనిచేసే రెస్టారెంట్ కి వెళ్తారు. కానీ ఈ లోపు మహేంద్ర జగతి (Jagathi)  దంపతులు వసు కోసం తన ఇంటికి వస్తారు.
 

66

ఆ తర్వాత దేవయాని (Devayani) సాక్షి నీకోసం అన్నీ వదిలేసి చదువు కూడా మానేసి వచ్చిందని రిషి తో చెబుతుంది. అంతేకాకుండా తనే ఈ ఇంటికి తగిన కోడలు అని చెబుతుంది. ఇక రిషి కు ఇంకెప్పుడూ మీరు ఈ ఇంటికి రావద్దని చెప్పి వసు రిషి (Rishi) ముఖం మీదనే తలుపులు వేస్తుంది.

click me!

Recommended Stories