Karthika Deepam: డాక్టర్ సాబ్ ను పెళ్లి చేసేసుకున్న జ్వాలా.. హిమను దారుణంగా అవమానించిన స్వప్న!

Published : May 05, 2022, 07:50 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఏప్రిల్ 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.  

PREV
16
Karthika Deepam: డాక్టర్ సాబ్ ను పెళ్లి చేసేసుకున్న జ్వాలా.. హిమను దారుణంగా అవమానించిన స్వప్న!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే హిమ (Hima) స్వప్న హెల్త్ చెక్ చేస్తూ ఉండగా స్వప్న చిరాకు పడుతూ ఉంటుంది. అదే క్రమంలోఇంజక్షన్ చేయడానికి భయపడతావు నువ్వు ఒక గొప్ప డాక్టర్ వి అని స్వప్న (Swapna) అంటుంది. అంతేకాకుండా మీరందరూ కలిసి నన్ను ఉద్దరించాల్సిన అవసరం లేదు అని అంటుంది.
 

26

మరోవైపు రెస్టారెంట్ లో జ్వాల (Nirupam) నిరూపమ్ లు ఒకరికొకరు మనసులో మాట చెప్పుకోవడానికి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక జ్వాల నిరూపమ్ నోటి నుంచి ఐ లవ్ యూ అనే పదాన్ని వినడం కోసం ఆరాట పడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు టీ పంచుకున్నాము తర్వాత జీవితాన్నే పంచుకుంటాం అని జ్వాల (Jwala) మనసులో అనుకుంటుంది.
 

36

ఇక జ్వాల (Jwala) ఐ లవ్ యు చెబుతూ ఉండగా ఈ లోపు అక్కడకు ప్రేమ్ (Prem) వస్తాడు. దాంతో జ్వాల మనసులో నువ్వేంట్రా బాబు సరిగ్గా టైం కి వచ్చావ్ అని చిరాకు పడుతూ ఉంటుంది. ఇక నిరూపమ్ కు చాలా ఫోన్స్ వస్తాయి. దాంతో నిరూపమ్ జ్వాల కు బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
 

46

మరోవైపు స్వప్న (Swapna) నా హెల్త్ గురించి నా కొడుకు చూసుకుంటాడు గాని నువ్వేమీ లేని పోనీ ప్రేమ లు వలక పోయాల్సిన అవసరం లేదు అని హిమ ను అంటుంది. ఈలోగా అక్కడకు నిరూపమ్ వచ్చి వాళ్ల మమ్మీకి హెల్త్ విషయంలో జాగ్రత్తలు చెబుతాడు. మరోవైపు సత్య (Sathya) కి జ్వాల భోజనం తీసుకొని వెళుతుంది.
 

56

ఇక జ్వాల (Jwala) నేను ఈ రోజు బిర్యాని తెచ్చాను అని చెబుతోంది. దాంతో తండ్రి కొడుకులు ఇద్దరు స్టన్ అవుతారు. ఇక ప్రేమ్ నిరూపమ్ కి ఫోన్ చేసి నీ రౌడీ బేబీ బిర్యానీ చేసింది తినడానికి రా అని చెబుతాడు. అంతేకాకుండా హిమ (Hima) కు కూడా ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెబుతాడు.
 

66

ఇక తరువాయి భాగం లో జ్వాల (Jwala) నిరూపమ్ (Nirupam) మీద ప్రేమ తో మొత్తం బిర్యానీ తనకే వడ్డీస్తుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరికి పెళ్లి అయితే ఏ విధంగా ఉంటుందో అని కూడా ఊహించు కుంటుంది. ఇక మిమ్మల్ని చూస్తే నన్ను నన్ను నేను మర్చి పోయి ఏదో లోకం లో కి వెళ్తాను డాక్టర్ సాబ్ అని అనుకుంటుంది.

click me!

Recommended Stories