Guppedantha Manasu: మహేంద్ర దంపతులను కసురుకుంటున్న వసు.. సూపర్ స్పీచ్ తో అదరగొట్టిన రిషి!

Published : Jul 13, 2023, 07:28 AM IST

Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్ తో ముందుకి సాగుతూ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. కొడుకు ఉన్నతిని చూసి గర్వపడుతున్న ఓ తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 13 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

PREV
19
Guppedantha Manasu: మహేంద్ర దంపతులను కసురుకుంటున్న వసు.. సూపర్ స్పీచ్ తో అదరగొట్టిన రిషి!

ఎపిసోడ్ ప్రారంభంలో సెమినార్ కి టైం అవుతున్న రిషి రాకపోవడంతో అందరూ కంగారు పడుతుంటారు. మహేంద్ర సార్ వాళ్ళు వచ్చారు అందుకే రిషి సార్ డిస్టర్బ్ అయినట్లున్నారు. ఇంక రారేమో అనుకుంటుంది వసు. విశ్వం కూడా అక్కడ లేకపోవడంతో నేను తీసుకు వస్తాను అంటూ ఏంజెల్ వెళ్తుంది.
 

29

ఇంతలో ప్రిన్సిపల్ వసు దగ్గరికి వచ్చి రిషి సార్ ఎక్కడికి వెళ్లారో తెలుసా.. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు మీరు ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. వసుధారనే చూస్తూ ఉంటాడు మహేంద్ర. ఏంటి సార్ అలా చూస్తున్నారు నేను ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయరు మీరు వచ్చారు అందుకే ఆయన డిస్టర్బ్ అయ్యారు. ఈ సెమినార్ కోసం కాలేజీలో అందరం ఎంత కష్టపడ్డామో తెలుసా? అయినా ఎందుకు సర్ వచ్చారు అని కసరుకుంటుంది వసుధార.
 

39

మేమేమీ కావాలని రాలేదు కాలేజీ వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే వచ్చాము అంటాడు మహేంద్ర. జగతి కూడా ఏదో మాట్లాడకపోతే మీరు మాట్లాడకండి మేడం నేను సార్ తో మాట్లాడుతున్నాను అని కోపంగా చెప్తుంది వసుధార. అయినా వాడు నా కొడుకు.. కచ్చితంగా వస్తాడు. వాడు బాధ్యతలకు విలువ ఇస్తాడు నేను వెళ్లి తీసుకు వస్తాను అంటాడు మహేంద్ర. ఇంతలోనే విశ్వం వాళ్ళు వస్తారు వస్తూనే రిషి ఇంకా రాలేదా అని అడుగుతారు.

49

నేను వెళ్లి తీసుకు వస్తాను అంటాడు మహేంద్ర. అంతలోనే రిషి వస్తాడు. రిషి ని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. మీ ఇద్దరి మధ్యన ఇంత బాండింగ్ ఉందా అంటాడు విశ్వం. అవును సార్ మీరు నాకు చాలా కావలసినవారు నాకు గురువుతో సమానం అంటాడు రిషి. అవును నాకు చాలా ఆత్మీయుడు అని రిషి ని గురించి చెప్తాడు మహేంద్ర. రిషి ని ఎవరైనా ఆత్మీయుడిగా భావించవలసిందే అంత గొప్పవాడు. మా అదృష్టం కొద్ది చాలా సంవత్సరాల నుంచి మాతోనే ఉంటున్నాడు అంటాడు విశ్వం.
 

59

ఇంతలో సెమినార్ కి టైం అవుతుంది అని చెప్పటంతో అందరిని డయాస్ మీదకి ఇన్వైట్ చేసి సెమినార్ ని ప్రారంభిస్తాడు ప్రిన్సిపల్. పవర్ ఆఫ్ స్టడీస్ సృష్టికర్త ఇప్పుడు మాట్లాడతారు అని చెప్తాడు. ఇప్పుడు నేను మాట్లాడలేను అంటాడు రిషి.అలా అంటే ఎలా మీరు దీని కోసం చాలా కష్టపడ్డారు కదా అంటాడు ప్రిన్సిపల్. జగతి కూడా మీరు చెప్తే వినాలని ఉంది మీరు మాట్లాడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తుంది.
 

69

ఇక తప్పదు అన్నట్టు మైక్ దగ్గరికి వెళ్లి స్పీచ్ ప్రారంభిస్తాడు రిషి. ముందుగా సహనాభవతు, సహనోగుణత్తు శ్లోకంతో స్పీచ్ ని ప్రారంభించి గురు శిష్యుల అనుబంధం గురించి ఆ శ్లోకం యొక్క తాత్పర్యం గురించి మరియు చదువు యొక్క ప్రయోజనం చదువు ఒక మనిషిని ఎంతవరకు తీసుకెళుతుందో చెప్పుకొస్తాడు రిషి. అలాగే ఆడవాళ్ళ చదువు కుటుంబానికి ఎంత ప్రయోజనమో చెప్పుకొస్తాడు.
 

79

అందరూ ఆ ఇన్స్పైరింగ్ స్పీచ్ కి చప్పట్లు కొడతారు. రిషికి దక్కుతున్న అభినందనలను చూసి గర్వంతో పొంగిపోతారు మహేంద్ర దంపతులు. స్పీచ్ ముగించిన తర్వాత అందరికీ కృతజ్ఞతలు చెప్పి కూర్చుంటాడు రిషి. అప్పుడు పాండ్యన్  స్టేజ్ మీదకి వెళ్లి పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే ఎప్పుడు స్టేజ్ కిందన గొడవలు చేయటమే కానీ కేజీకి మాట్లాడటం నాకు తెలియదు అలాంటిది నేను ఎలా మాట్లాడుతున్నానంటే అందుకు కారణం రిషి సారె.
 

89

 కాలేజీ అంటే ఎంజాయ్మెంట్ అనుకునే మమ్మల్ని  నైట్ కాలేజీకి తీసుకువెళ్లి జీవితం అంటే ఏమిటో తెలియజేశారు. రిషి సార్, వసుధార మేడం లాంటి గురువులు ఉంటే ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుంది అలాంటి ఆ ఇద్దరు గురువులని సన్మానించుకోవాలని ఉంది అంటాడు పాండ్యన్.
 

99

నువ్వు అన్నట్లుగానే చేద్దాము. కాకపోతే మన అతిధులు  అయిన జగతి మేడం, మహేంద్ర సార్ చేతుల మీదుగా ఈ సన్మానం చేయిద్దాం అంటాడు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ పిలవటంతో వసుధార స్టేజ్ మీదకి వెళుతుంది. రిషికి వసుధరకి మహేంద్ర దంపతులు సాలువా కప్పి బొకే ఇస్తారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!

Recommended Stories