లోకనాయకుడు కమల్ హాసన్ కూతురైన శృతి హాసన్ స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. నచ్చినట్లు బ్రతకడమే లైఫ్ అంటుంది. రిలేషన్, అఫైర్స్ బహిరంగంగానే చేస్తుంది. ఇక శృతి జీవన శైలి విదేశీలకు దగ్గరగా ఉంటుంది.
27
Shruti Haasan
తాజాగా శృతి ప్రింటెడ్ డిజైనర్ వేర్లో సూపర్ స్టైలిష్ గా దర్శనమిచ్చారు. రెండు జడల్లో ఆమె లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. శృతి లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుండగా, నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
37
Shruti Haasan
శృతి హాసన్ కెరీర్ ఆశాజనకంగా సాగుతుంది. కొన్నాళ్లు పరిశ్రమకు దూరమైన శృతి కమ్ బ్యాక్ అనంతరం పుంజుకుంది. క్రాక్, వకీల్ సాబ్ వంటి హిట్స్ ఆమెకు ఆఫర్స్ తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా దర్శకుడు గోపి చంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ మాంచి కిక్ ఇచ్చింది.
47
Shruti Haasan
ఇక 2023 సంక్రాంతి సందడి మొత్తం శృతి హాసన్ దే. ఆమె హీరోయిన్ గా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. రెండు చిత్రాలకు కలిపి మంచి ప్యాకేజ్ అందుకున్నట్లు సమాచారం.
57
Shruti Haasan
కాగా శృతి చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ సలార్. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. సలార్ రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం కలదంటున్నారు. అదే జరిగితే శృతి పంట పండినట్లే. సలార్ 2 కూడా ఆమె ఖాతాలో చేరుతుంది.
67
Shruti Haasan
మరోవైపు శృతి లవ్ ఎఫైర్ లో ఉన్నారు. ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు.
77
Shruti Haasan
గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లే అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.