Ennenno Janmala Bandham: నిశ్చితార్థాన్ని ఆపేసిన వసంత్.. మరో నాటకం మొదలు పెట్టిన మాళవిక!

First Published Sep 28, 2022, 1:51 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 28వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...యష్, వేదతో అక్కడ ఏం జరిగిందో, ఆఖరి నిమిషంలో ఎలా మార్చావో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు అని అంటాడు. అప్పుడు వేద, ఏంటి ఇదంతా కోపమేనా! మీరు కోపంగా ఉంటే చాలా బాగుంటారు తెలుసా అని అంటుంది. దానికి యశ్,నేను ఏం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు. నువ్వు ట్విస్ట్ ఇస్తాను అన్నప్పుడే నిన్ను గదిలో పెట్టి లాక్ చేసేయాల్సింది నేనే తప్పు చేశాను అని అంటాడు.దానికి వేద,మీరు నన్ను లాక్ చేసిన దాన్ని బ్రేక్ చేసుకుని బయటికి రాగాల సత్తా నాకున్నది.మీరు చెప్తే ముహూర్తం పెట్టే పంతులుగారు మీకుంటే నేను చెప్తే అదే ముహూర్తాన్ని మార్చేసే పంతులుగారు నాకు కూడా ఉన్నారు ట్విస్ట్ ఎలాగున్నాది.

వేద వైఫ్ యశోదర్ అంటే ఈమాత్రం లేకపోతే ఎలా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత సీన్లో సులోచన, అనుకున్నదొకటి, అయినది ఒక్కటి అని మాలిని దగ్గరికి వచ్చి పాట పాడుతుంది. వదిన గారు ఒక సామెత ఉంటుంది లెండి మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు అని సులోచన అనగా, చేసిందంతా మీరు అయితే మధ్యలో దైవాన్ని లాగడం ఎందుకు అని మాలిని అంటుంది.అప్పుడు సులోచన,మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప మేము ఇంకేం చేయలేదు అని అంటుంది.దానికి మాలిని, మీరు అనుకున్నది జరగడం కోసం అందరినీ మోసం చేయడం మంచి ఎలా అవుతుంది అని మాలిని అనగా, చేసే పనిలోనే కాకుండా వచ్చే ప్రతిఫలంలో కూడా మంచి నీ చూడాలి అని అంటుంది సులోచన. అంటే నన్ను ఢీకొట్టే ధైర్యం లేక లేనిపోని పుకార్లు పుట్టించి నన్ను, రత్నాన్ని విడగొట్టడానికి ప్రయత్నించినట్టా అని మాలిని అనగా, సులోచన ,మీరు మాత్రం తక్కువ తిన్నారేంటి అమర ప్రేమికుడు పేరుతో గులాబీలు ఉత్తరాలు పంపి, నాకు మా ఆయనకి మధ్య దూరం పెంచాలి అనుకున్నారు కదా అని అంటుంది సులోచన.
 

ఎవరి బుద్ధి ఏంటో చిత్రం ముహూర్తాలు అయ్యాక చెప్తాను చాలా తెలివిగా ముహూర్తాలు మార్చేశారు కదా అని మాలిని అనగా, గ్రహాలు అనుగ్రహిస్తే ఇలాగే జరుగుతుంది వదిన గారు అని సులోచన అంటుంది. మీ గురించి అంతా తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా నాది తప్పు అని మాలిని అంటుంది.అప్పుడు సులోచన, కొన్ని నిమిషాల్లో మీరు చిత్తు చేస్తారో,చిత్తు అవుతారో తెలుస్తుంది అంతటి దానికి చాలెంజ్ లు ఎందుకులెండి. అసలుకే మీకు అచ్చు రావడం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సులోచన. అప్పుడు మాలిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సీన్లో వసంత్, నిధిల నిశ్చితార్థం జరుగుతూ ఉండగా చిత్ర ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నిధి వసంత్కి బొట్టు పెడుతుంది.వసంత్ కూడా కి నిధికి కుంకుమ పెడతాడు కానీ మనసులో మాత్రం చిత్ర గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ దండలు మార్చుకుంటారు.

ఇంతలో పంతులుగారు వసంత్ కి ఉంగరం ఇచ్చి నిధి కి పెట్టమని అనగా వసంత్ ఆలోచనలో పడతాడు. ఏం చేస్తున్నావు ఉంగరం తొడగరా అని అందరూ అన్నప్పుడు వసంత్ చిత్ర గురించి ఆలోచించి ఈ నిశ్చితార్థం  చేసుకోవడం నావల్ల కావడం లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు నిధి, ఇప్పటివరకు బానే ఉన్నావు కదా వసంత్ నాతో సంతోషంగానే ఉన్నావు కదా అని అనగా, నేను సంతోషంగా లేను నిధి. నేను సంతోషంగా ఉన్నట్టు నటించాను నేను నిన్ను ప్రేమించడానికి ఎంత ప్రయత్నించినా సరే నా మనసులో ఇంకొక రూపం ఉన్నది. నేను నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకొని నీకు అన్యాయం చేయలేనూ, నాకు అన్యాయం చేసుకోలేను అని అంటాడు. దానికి నిధి బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు యష్,నిధి  తండ్రి తండ్రులతో నేను ఎలాగైనా వసంత్ ని ఒప్పిస్తాను.

 కొంచెం సేపు ఆగండి అని అనగా, వాళ్ళు పట్టించుకోకుండా ఇంకా చేసింది చాలు మా నిధి చాలా బాధపడింది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు యష్ వసంత్ నీ తిడుతున్నప్పుడు,వసంత్, యష్ నాకు తెలుసు నేను నీది మాటని జవ దాటాను అని. చిన్నప్పుడు నుంచి నువ్వు ఏం చెప్పినా నేనేమీ అనలేదు నువ్వు మంచి నిర్ణయాలు తీసుకుంటావు అని నాకు తెలుసు. కానీ ఇది నావల్ల కావడం లేదు నువ్వు ఆరోజు బ్రేకప్ చెప్పే మన్నావు అది అయిపోయిన తర్వాత నేను నిజంగానే నిధిని ప్రేమించడానికి చాలా ప్రయత్నించాను. 
 

కానీ ఎంత ప్రేమించడానికి ప్రయత్నించినా సరే నా మనసులో చిత్ర రూపమే కనిపిస్తుంది.ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చేయలేను. నాకు చిత్ర అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను నీ మాటని కాదన్నాను. అనాధ ల ఉన్న నాకు, నువ్వే అన్నయ్యవయ్యావు, స్నేహితుడు కూడా అయ్యావు. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేను.ఒకవేళ నేను చనిపోయిన కూడా నన్ను నీ తమ్ముడు గానే స్వీకరించు, నువ్వు లేకుండా నేను ఉండలేను అని అనగా యష్, వసంత్ తో ప్రాణం విలువ తెలుసా నీకు. 
 

అయినా ఇంత పిరికోడినీ నువ్వు ఎలా ప్రేమించావు చిత్రా? బహుశా వాడిలో లేనిది నీలో చూసుకుంటున్నట్టు ఉన్నాడు వీడు అని అంటున్నాడు. దానికి వసంత్ ఆశ్చర్యపోయి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు యష్ అని అంటాడు. ఇదంతా నాటకం రా నీలోన భయం పోగొట్టి నీ అంతట నువ్వే మా అందరికీ నిజం చెప్పాలని మేము ఆడిన నాటకము. అలాగే చిత్రకి వైభవ్ కి పెళ్లి కూడా నాటకమే ఇదంతా మీ వదిన ఆడిన నాటకం అని అనగా వైభవ్, హమ్మయ్య యష్ గారు  ఈ మాట మీరు చెప్పేసరికి పెద్ద భారం భుజం మీద నుంచి దిగినట్టు అనిపించింది. 
 

నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. చిత్ర నాకు చెల్లి లాంటిది అని అంటాడు వైభవ్. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఆనందపడతారు  అప్పుడు యష్ చిత్రని, వసంత్ నీ పక్కన నించో పెత్తి, నేను మీ వదినకి మాట ఇచ్చాను, మీ ఇద్దరి పెళ్లి చేస్తానని నేను ఎప్పుడూ నా మాట తప్పను అని అంటాడు. అప్పుడు వేదా యష్ వైపు చూసి థాంక్స్ అని చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!