మిర్చి, బాహుబలి సిరీస్ అనుష్క స్టార్ డమ్ మరింత పెంచాయి. అయితే అనుష్క తీసుకున్న రాంగ్ డెసిషన్ ఆమె కెరీర్ ని దెబ్బతీసింది. బాహుబలి 1 విడుదల తర్వాత గ్యాప్ లో సైజ్ జీరో టైటిల్ తో ఓ మూవీ చేసింది. ఈ సినిమాలో పాత్ర కోసం బాగా బరువు పెరిగింది. అనుష్క పిచ్చ డెడికేషన్ తో చేసిన సైజ్ జీరో మూవీ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దానికి తోడు అనుష్క తిరిగి నార్మల్ ఫిజిక్ సాధించలేకపోయింది.