Varun Tej, Matka, Allu Arjun
వరుణ్ తేజ్ కామెంట్స్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారాయి. మట్కా మూవీ నవంబర్ 14న రాబోతోంది. ఈ మేరకు ఆదివారం నాడు వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ స్టేజ్ మీద మాట్లాడిన మాటలతో ఇండైరక్ట్ గా అల్లు అర్జున్ కు కౌంటర్స్ వేసారనిపించింది. నిజాయితీగా మాట్లాడినట్టుగా కొందరు అన్నా ఇది సోషల్ మీడియా వివాదం క్రిందే భావిస్తూ డిస్కషన్ చేస్తోంది.
Varun Tej, Kanaka Raju, Merlapaka Gandhi
వరుణ్ తేజ్ ఈ స్టేజిపై తన పోయిన సినిమాల గురించి మాట్లాడాడు. కొత్త ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చాడు. సినిమాలు పోయినప్పుడు కాస్త బాధగా అనిపిస్తుందని, ఆ టైంలోనే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందని, తన అన్న రామ్ చరణ్ తనకు అండగా నిలుస్తాడని, మోరల్ సపోర్ట్ ఇస్తాడని చెప్పుకొచ్చాడు.
వంద మాటలు మాట్లాడాల్సిన పని లేదు.. తన అన్న రామ్ చరణ్ భుజం మీద చేయి వేస్తే చాలని అన్నాడు అంత వరకూ బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ ప్రస్తావన ఇండైరక్ట్ గా తెచ్చినప్పుడే మొత్తం మారిపోయింది.
తన ఫ్యామిలీ గురించి వరుణ్ తేజ్ చెప్తూ...''ఎంతసేపూ పెదనాన్న, బాబాయ్, అన్న గురించి ఎందుకు పదే పదే చెబుతావ్ అని తనను అంతా అడుగుతారు , అయ్యా... నేను మా పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య రామ్ చరణ్, తండ్రి నాగబాబు గురించి మాట్లాడతా. అది నా ఇష్టం.. మనం పెద్దోళ్లం అవ్వొచ్చు..
అవ్వకపోవచ్చు.. సక్సెస్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం.. ఎలా వచ్చాం.. అన్నది చెప్పుకోకపోతే ఎంత సక్సెస్ అయినా వృథానే అని అన్నాడు. ఈ మాటలు మాత్రం అల్లు అర్జున్ మీద కౌంటర్లే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు.
ఆంధ్రాలో ఎన్నికలకు ముందు, జనసేన పార్టీ అఖండ విజయానికి ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. పవన్ కల్యాణ్ తరఫున ఎక్కడా ప్రచారం చేయని ఆయన, తన స్నేహితుడు కోసం అంటూ శిల్పా రవి ఇంటికి వెళ్లడం మెగా ఫ్యాన్స్ అందరికీ ఆగ్రహం తెప్పించింది.
ఆ తర్వాత 'మారుతి నగర్ సుబ్రమణ్యం' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మరోసారి ఆ ఇష్యూ గురించి పరోక్షంగా మాట్లాడారు బన్నీ. తనకు ఇష్టమైతే వెళ్తా, వస్తానంటూ చెప్పారు. వీటిన్నటినీ దృష్టిలో పెట్టుకుని ''నువ్ ఎక్కడ నుంచి వచ్చావ్? నీ సపోర్ట్ ఎవరు? అనేది మర్చిపోతే నీ సక్సెస్ పనికి రాదు'' అని వరుణ్ తేజ్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
ఈ కామెంట్స్ అంతటా వైరల్ అయ్యాయి. ఖచ్చితంగా అయితే సినిమా ప్రమోషన్స్ కోసం వరుణ్ తేజ్ అలా మాట్లాడడు అవసరం లేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో తమ కుటుంబం బాధపడిందనే విషయం ఇలా ఇండైరక్ట్ గా చెప్పుకొచ్చారని ఆయన అభిమానులు అంటున్నారు.
ఈ కామెంట్స్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమాకు దూరం అవుతారని, అది నష్టమే అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇలా మాట్లాడటం వల్ల మీడియాలో కొంత ఎటెన్షన్ గ్రాబ్ అవ్వచ్చమో..తమ కుటుంబంలో కలతలు ఉన్నాయని ఒప్పుకున్నట్లు అయ్యిందని చెప్తున్నారు. మట్కా సినిమాకు ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి ఏ ఇబ్బందీ లేదు.
మట్కా విషయానికి వస్తే... పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో టాలీవుడ్ యాక్టర్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తోన్న చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం డైరెక్టర్ కరుణకుమార్ కాంపౌండ్ నుంచి వస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మట్కా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో నవంబర్ 14న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ అప్‌డేట్ వచ్చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. టైటిల్స్‌తో కలిపి సినిమా పూర్తి నిడివి 2 గంటల 39 నిమిషాలు.