Ntr, Devara, koratala shiva
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర: పార్ట్ 1 ఓటిటి లో కుమ్మేస్తుంది. ఈ సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చింది. ఓటిటిలోనూ హైప్‌కు అనుగుణంగా ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దేవర అన్ని భాషల్లోనూ బాగానే వర్కవుట్ అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమా బాగా నడిచింది. ఈ తెలుగు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
దేవర పార్ట్ 1 మూవీ ఓవరాల్‌గా రూ. 182.25 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో 184 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అమౌంట్ మార్క్ ఇరవై రోజులకే లాభాల వైపు పయనించింది దేవర చిత్రం. మొత్తంగా 22 రోజుల్లోనే దేవర సినిమాకు 66.21 కోట్ల మేర ప్రాఫిట్ వచ్చాయి. ఓటిటిలోకి రావటంతో సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని ట్రేడ్ లెక్కేసింది. ఆ లెక్కలు చూద్దాం.
Devara Troll
దేవర చిత్రం తెలుగు వెర్షన్ 200 కోట్లు షేర్ (జీఎస్టీతో కలిసి) తెచ్చుకుంది. ఆంధ్రా,నైజాంలలో ఈ సినిమా దుమ్ము రేపింది. పెట్టిన పెట్టుబడి కు 125% రికవరీ అయ్యింది. మేజర్ బ్లాక్ బస్టర్ గా చెప్పాలి.
‘దేవర’ సినిమా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ గా రన్ క్లోజ్ అయింది. తెలుగుతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీలో ఈ సినిమా థియేట్రికల్ గా రన్ ముగిసింది. సినిమా నైజాం ఏరియాలో ఆల్ రెడీ ఎపిక్ లాభాలను సొంతం చేసుకుంది…ఇక రాయలసీమ ఏరియాలో కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…సినిమా రాయలసీమ లో నాన్ రాజామౌలి మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
Devara
ఏరియా వైజ్ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ చూస్తే..
AREA SHARE
నైజాం ₹ 55 Cr
సీడెడ్ ₹ 31 Cr ₹
ఉత్తరాంధ్ర ₹ 19 Cr ₹
గుంటూరు ₹ 12.5 Cr
ఈస్ట్ గోదావరి ₹ 9.25 Cr
వెస్ట్ గోదావరి ₹ 7.8 Cr
కృష్ణా ₹ 9.2 Cr
నెల్లూరు ₹ 6.3 Cr
ఆంధ్రా/తెలంగాణా ₹ 150.05 Cr
రెస్టాఫ్ ఇండియా (Approx)
ఓవర్ సీస్ ₹ 31.5 Cr
వరల్డ్ వైజ్ ₹ 201.5 Cr
Junior NTRs Devara India collection report out
‘దేవర’ కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా అక్కడ రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అక్కడ ఈ సినిమా అక్కడ దాదాపు రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.మొత్తంగా ‘దేవర’ మూవీ అక్కడ రూ.19 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 16 కోట్లకు గాను రూ. 19 కోట్ల కలెక్షన్స్ రాబట్టి దాదాపు రూ. 3 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
Junior NTR starrer Devara collection report out
ఈ సినిమా కేరళలో రూ. 1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. రూ. 1.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 6 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది.
‘దేవర’తో రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రికార్డ్ లు క్రియేట్ చేసింది.