టైటిల్ ఫేవరేట్ కి బిగ్ షాక్, ఈ వారం ఎలిమినేషన్ తప్పదా, ఓటింగ్ లో అనూహ్య మలుపులు

First Published | Nov 12, 2024, 12:47 PM IST

లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్ పరిశీలిస్తే అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. టైటిల్ ఫేవరేట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ మొదలైంది. 
 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  పది వారాలు పూర్తి చేసుకుని 11వ వారం లో అడుగుపెట్టింది. అంటే షో చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. మరో నెల రోజుల్లో లేటెస్ట్ సీజన్ ముగియనుంది. 

గత వారం గంగవ్వ ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఎలిమినేట్ కాకుండానే గంగవ్వ షోకి గుడ్ బై చెప్పింది. వ్యక్తిగత కారణాలతో గంగవ్వ బయటకు వచ్చేశారు. ఇక నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి యష్మి-హరితేజ మిగిలారు. వీరిద్దరిలో హరితేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 

గంగవ్వ, హరితేజ నిష్క్రమణతో బిగ్ బాస్ హౌస్లో 10 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. సోమవారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. యష్మి, గౌతమ్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, పృథ్వి, అవినాష్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్ లో అనూహ్య ఫలితాలు నమోదు అయ్యాయి. 
 


అనూహ్యంగా గౌతమ్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాడట. గౌతమ్ కి ఏకంగా 25 శాతం ఓట్లు పోల్ అయ్యాయట. గౌతమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇతడు సీజన్ 7 కంటెస్టెంట్ అన్న విషయం తెలిసిందే. గౌతమ్ కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. అయినప్పటికీ వారందరినీ వెనక్కి నెట్టి ఓటింగ్ లో దూసుకుపోతున్నాడని సమాచారం.


గౌతమ్ తర్వాత రెండో స్థానంలో యష్మి ఉందట. ఆమెకు కూడా 20 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయట. ఆట పరంగా ఆకట్టుకుంటున్న యష్మికి ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. ఆమె డే వన్ నుండి హౌస్లో ఉంది. అది కూడా కలిసొచ్చే అంశం. వీరిద్దరి తర్వాత మూడో స్థానంలో పృథ్వి ఉన్నాడట. ఇక నాలుగో స్థానంలో టేస్టీ తేజ ఉన్నాడట. 

చివరి రెండు స్థానాల్లో విష్ణుప్రియ, అవినాష్ ఉన్నారట. విష్ణుప్రియ టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా పరిచయమైన 14 మంది కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ. ఆమెకున్న ఫేమ్ మరొకరికి లేదు. ఆ హోదా విష్ణుప్రియ నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఆమె దృష్టి ఆటపై కంటే పృథ్విరాజ్ పైనే ఎక్కువ ఉంది. 

విష్ణుప్రియ ఏ విధంగా తన మార్కు చూపించడం లేదు. టైటిల్ ఫేవరెట్ కాస్తా ఎలిమినేట్ అయ్యే స్థాయికి పడిపోయింది. ఈ వారం ఆమె డేంజర్ జోన్లో ఉంది. ఇంటిని వీడినా ఆశ్చర్యం లేదు. విష్ణుప్రియ గోల్డెన్ ఛాన్స్ కోల్పోయింది. వైల్డ్ కార్డు ఎంట్రీలకు టైటిల్ కొట్టే ఛాన్స్ ఎలాగూ ఉండదు. ఏ మాత్రం గేమ్ చూపించినా విష్ణుప్రియ టైటిల్ రేసులో ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. 

అలాగే అవినాష్ డేంజర్ జోన్లో ఉండటం కూడా ఊహించని పరిణామమే. వైల్డ్ కార్డు ఎంట్రీలలో అవినాష్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. గొప్ప ఎంటర్టైనర్. అతడికి ఓట్లు భారీగా పడతాయి. కానీ అవినాష్ చివరి రెండు స్థానాల్లో ఉంటాడని ఊహించలేము. అయితే ఓటింగ్ కి ఇంకా చాలా రోజుల సమయం ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ గా ఉంటాయి. మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. 

ఇది అనధికారిక ఓటింగ్ మాత్రమే. మెజారిటీ మీడియా సంస్థల పోల్స్ ఆధారంగా సేకరించిన సమాచారం. అధికారిక ఓటింగ్ ని స్టార్ మా బయటపెట్టదు. 

Latest Videos

click me!