`మట్కా` అడ్వాన్స్ బుకింగ్ దారుణం.. వరుణ్‌ తేజ్‌ సినిమాకి ఏమాత్రం బజ్‌ లేదేంటి? కారణం అదేనా?

First Published | Nov 13, 2024, 5:45 PM IST

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన `మట్కా` సినిమా రిలీజ్‌ కి ఒక్క రోజే టైముంది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం ఈ మూవీ చాలా దారుణమైన రిజల్ట్ ని ఫేస్‌ చేస్తుంది. 
 

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కి సరైన హిట్‌ పడటం లేదు. `ఫిదా`, `ఎఫ్‌2` తర్వాత తనకు బ్రేక్‌ ఇచ్చే సక్సెస్‌ రాలేదు. డిఫరెంట్‌ మూవీస్‌ చేస్తున్నా వర్కౌట్‌ కావడం లేదు. ప్రయోగాలు కూడా ఫలించడం లేదు. వరుసగా `గని`, `గాంఢీవధారి అర్జున`, `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో రూట్‌ మార్చాడు వరుణ్‌. మాస్‌ మూవీస్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. ఊరమాస్‌, గ్యాంగ్‌ స్టర్‌ బేస్డ్ చిత్రాలకు ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతుంది. ఆడియెన్స్ అలాంటి చిత్రాలను ఆదరిస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

దీంతో హీరో వరుణ్‌ తేజ్‌ కూడా నేటి ట్రెండ్‌కి తగ్గ కథని ఎంచుకున్నాడు. `మట్కా` అనే సినిమాలో నటించారు. ఇది వాసు అనే మట్కా కింగ్‌ జర్నీని తెలియజేసే మూవీ. రతన్‌ ఖేత్రి అనే మట్కా గ్యాంగ్‌ స్టర్‌ జీవితం ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు దర్శకుడు కరుణ కుమార్‌.

ఆయన ఇప్పటికే `పలాస 1978` చిత్రంతో హిట్‌ అందుకున్నాడు. కంటెంట్‌ ఉన్న దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు.  ఈ క్రమంలో ఇప్పుడు వరుణ్‌ తేజ్‌తో `మట్కా` సినిమా చేశారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ రేపు గురువారం(నవంబర్‌ 14)న విడుదల కాబోతుంది. 
 


అయితే సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ చాలా ప్రమోషన్స్ చేశారు. ఈవెంట్లు నిర్వహించారు. పలు మాల్స్ కి వెళ్లారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తీరిక లేకుండా గడిపారు. బిగ్‌ బాస్‌ షోకి కూడా వచ్చాడు. తాజాగా ఈ రోజు ఆయన తిరుమల శ్రీవారిని సైతం దర్శించుకున్నారు. తాను నటించిన `మట్కా` మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకున్నారు. శ్రీవారి ఆశిస్సులు తీసుకున్నారు.  

సినిమా రిలీజ్‌కి ఇంకా కొన్ని గంటలే ఉంది. కానీ బుకింగ్స్ లో మాత్రం వెనకబడిపోయింది. `మట్కా` సినిమాకి తెలుగు స్టేట్స్ లో పెద్దగా బజ్‌ కనిపించడం లేదు. ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి ముందస్తు ఆదరణ కనిపించడం లేదు.  
 

సాధారణంగా బజ్‌ ఉన్న సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జోరు చూపిస్తాయి. కానీ ఈ సినిమాకి ఆ క్రేజ్‌ ఏమాత్రం కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ప్రధాన థియేటర్లన్నీ ఇప్పటి వరకు ఫుల్‌ కాలేదు కదా, కనీసం సగం బుకింగ్స్ కూడా లేవు. ఇప్పటికీ అన్నీ గ్రీన్‌ గా చూపిస్తున్నాయి. కేవలం 10-20 శాతం సీటింగ్‌ మాత్రమే బుకింగ్స్ లో కనిపిస్తున్నాయి. చాలా చోట్ల అవి కూడా లేవు.

ఈ సినిమాకి నైజాంలో భారీగా థియేటర్లు ఇచ్చారు. కానీ అన్నీ ఖాళీగానే ఉండటం గమనార్హం. వరుణ్‌ తేజ్‌ సినిమాకి ఇలాంటి పరిస్థితి కనిపించడం షాకిస్తుంది. అయితే ఆయన నటించిన గత సినిమాలు పరాజయం చెందడం కారణంగానే దీనికి బజ్‌ లేదని, ప్రభావం వల్లే ఆడియెన్స్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది.
 

 హ్యాట్రిక్‌ ఫ్లాపులు ఉన్న నేపథ్యంలో ఆడియెన్స్ నుంచి హోప్స్ కనిపించడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. కానీ సినిమాకి పాజిటివ్‌ వస్తే పుంజుకునే ఛాన్స్ ఉంది. ఇటీవల చాలా సినిమాలు పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని పుంజుకుంటున్నాయి. ఈ మూవీ కూడా అలానే పుంచుకుంటుందా అనేది చూడాలి.  ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.15కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగిందని సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా 18 కోట్ల బిజినెస్‌ అయ్యిందట. సినిమా హిట్‌ కావాలంటే థియేట్రికల్‌గా సుమారు 40కోట్ల గ్రాస్‌ రావాలి. లేదంటే నష్టాలు తప్పవు. ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే సూర్య నటించిన `కంగువా`పై భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతుంది. మరి ఆ సినిమా ముందు `మట్కా`నిలబడుతుందా అనేది చూడాలి. 

Read more: ఆగిపోయిన కృష్ణంరాజు సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన బాలకృష్ణ.. ఆ మూవీ ఏంటి? అసలేం జరిగిందంటే?

also read: లావణ్య త్రిపాఠి రీఎంట్రీపై వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా? మెగా ఫ్యామిలీ కండీషన్స్ కి కౌంటర్‌

Latest Videos

click me!