పెళ్లి కాకుండా సీనియర్ హీరోతో పిల్లల్ని కనడానికి ప్రయత్నించిన నటి.. ఇద్దరినీ విడదీసింది ఎవరో తెలుసా ?

First Published | Nov 13, 2024, 5:35 PM IST

సెలెబ్రిటీల రిలేషన్స్ షిప్ లో ఎన్నో చిత్రాలు, ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. చిత్ర పరిశ్రమలో రిలేషన్ షిప్స్ అనేవి ఇప్పటివి కాదు. మహానటి సావిత్రి టైం నుంచే ప్రేమ వివాహాలు ఉన్నాయి. కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల చాలా మంది స్టార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సెలెబ్రిటీల రిలేషన్స్ షిప్ లో ఎన్నో చిత్రాలు, ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతుంటాయి. చిత్ర పరిశ్రమలో రిలేషన్ షిప్స్ అనేవి ఇప్పటివి కాదు. మహానటి సావిత్రి టైం నుంచే ప్రేమ వివాహాలు ఉన్నాయి. కొన్ని రాంగ్ డెసిషన్స్ వల్ల చాలా మంది స్టార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పర్సనల్ లైఫ్ లో ఇబ్బదులు ఎదుర్కొన్న నటుల్లో సీనియర్ నటుడు శరత్ బాబు ఒకరు. 

శరత్ బాబు యుక్త వయసులోనే తనకంటే వయసులో పెద్ద అయిన నటి రమాప్రభని వివాహం చేసుకున్నారు. కొంతకాలం తర్వాత శరత్ బాబు, రమాప్రభ విడిపోయారు. శరత్ బాబుపై ఒక దశలో రమాప్రభ తీవ్ర విమర్శలు చేశారు. తనవల్ల ఎదిగి తనకే అన్యాయం చేశాడని రమాప్రభ చాలా సందర్భాల్లో ఆరోపించింది. శరత్ బాబు కూడా తిరిగి ఆమెపై ఆరోపణలు చేశారు. శరత్ బాబు జీవితంలో ప్రేమ వ్యవహారాలు చాలానే ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. 


తెలుగు నటి జయలలిత గురించి పరిచయం అవసరం లేదు. వ్యాంప్ తరహా పాత్రలతో పాపులర్ అయ్యారు. అప్పట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంలో ఆమె అసెంబ్లీ స్పీకర్ పాత్రలో నటించి మెప్పించారు. అప్పట్లో శరత్ బాబు, జయలలిత మధ్య రిలేషన్ ఉండేదని వీళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగారని వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో జయలలిత స్పందిస్తూ.. శరత్ బాబుతో కొంతకాలం సహజీవనం చేసిన మాట వాస్తవమే అని అన్నారు. 

మేమిద్దరం ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం. నా కోసం దేవుడు పంపిన గైడ్ ఆయన. బావా అని పిలిచేదాన్ని. ఇద్దరం కలసి ఎన్నో తీర్థ యాత్రలు చేశాం. ఒక దశలో ఆయనతో పిల్లల్ని కనాలని ప్రయత్నించా. ఆయన ద్వారా ఒక బిడ్డని పొందాలని కోరుకున్నా. మేమిద్దరం ప్రేమలో ఉన్నప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు కొందరు మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు కొంత వరకు సక్సెస్ అయ్యారు. 

దీనితో నాతో పిల్లలని కనడానికి శరత్ బాబు ఆలోచనలో పడ్డారు. ఆయన్ని పిల్లల గురించి అడిగితే.. ఆలోచిస్తున్నా అని చెప్పారు. ఒక వేళ మనం పోతే మన బిడ్డని ఆస్థి కోసం బంధువులు వేధిస్తారు. అలాంటి పరిస్థితి వద్దు అని శరత్ బాబు నాతో చెప్పారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకరు ఇద్దరు నాతో ఇప్పటికీ క్లోజ్ గా ఉంటారు అని జయలలిత తెలిపారు. 

Latest Videos

click me!