భార్య కోసం సాయి పల్లవిని వెనక్కి నెట్టేసిన వరుణ్ తేజ్.. సిగ్గు పడకుండా చెప్పేశాడు

First Published | Feb 7, 2024, 9:59 AM IST

సాయి పల్లవి లాంటి గొప్ప నటిని పక్కకి నెట్టి తన భార్య లావణ్య త్రిపాఠికే వరుణ్ తేజ్ జై కొట్టాడు. విద్యార్థులతో వరుణ్ మాటాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత ఏడాది తన ప్రియురాలు లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ నటులే కావడంతో తమ ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు కూడా. 

వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ. ఆపరేషన్ వాలంటైన్ తొలి తెలుగు ఎయిర్ ఫోర్స్ చిత్రంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. మార్చ్ 1 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. 


సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆపరేషన్ వాలంటైన్ చిత్ర యూనిట్ మల్లారెడ్డి కాలేజ్ లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్థులు అడిగిన అనేక సరదా అంతే సరదాగా వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చారు. 

ఓ స్టూడెంట్ మాట్లాడుతూ.. అన్నా మీ ఫేవరిట్ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నించాడు.. దీనికి వరుణ్ తేజ్ ఏమాత్రం సిగ్గు పడకుండా నా ఫేవరిట్ హీరోయిన్ ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను. నా ఫేవరిట్ హీరోయిన్ మా ఇంట్లోనే ఉంది అని వరుణ్ తేజ్ ఇంకా ఫన్నీగా చెప్పాడు. 

మరో విద్యార్థి మేడం కాకుండా మీ ఫేవరిట్ ఎవరు అని ప్రశ్నించగా అప్పడు అసలు సమాధానం బయటకి వచ్చింది. బయట హీరోయిన్లలో తనకి సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అని వరుణ్ తెలిపాడు. వరుణ్ తేజ్ పెళ్లయ్యాక సాయి పల్లవి లాంటి గొప్ప నటిని పక్కకి నెట్టి తన భార్యకి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ పేలుతున్నాయి. 

అలాగే విద్యార్థులు మెగా మల్టీస్టారర్ గురించి ప్రశ్నించగా ఎవరైనా కథ తీసుకువస్తారేమోనని తాను కూడా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. గద్దలకొండ గణేష్ లాంటి చిత్రం కావాలని ఫ్యాన్స్ అడగగా ఆపరేషన్ వాలంటైన్ తర్వాత రాబోతున్న మట్కా చిత్రం మాస్ గా ఉంటుందని వరుణ్ తెలిపాడు. 

Latest Videos

click me!