బిగ్ బాస్ షోకి కుమారి ఆంటీ... స్వయంగా క్లారిటీ ఇచ్చిన సోషల్ మీడియా సెన్సేషన్!

First Published | Feb 7, 2024, 7:53 AM IST

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆమె కోసం ఏకంగా తెలంగాణ సీఎం స్పందించడంతో మరింత పాప్యులర్ అయ్యారు. కుమారి ఆంటీ బిగ్ బాస్ షోకి వెళతారని ప్రచారం అవుతుండగా, ఆమె స్వయంగా స్పందించారు. 
 

స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ అనూహ్యంగా ఫేమ్ తెచ్చుకున్నారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి ప్రాంతంలో కుమారి ఆంటీ కొన్నాళ్లుగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలతో తక్కువ ధరకు భోజనం అందిస్తుంది. పలువురు యూట్యూబర్స్ ఆమెను ఇంటర్వ్యూ చేయడం, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. 

Kumari Aunty

కుమారి ఆంటీ సోషల్ మీడియా స్టార్ అయ్యారు. కుమారి ఆంటీని చూసేందుకు, ఆమె చేతి వంటకాలు రుచి చూసేందుకు పదుల సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె బిజినెస్ క్లోజ్ చేయించారు. 


kumari aunty

దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. మేటర్ సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళింది. స్వయంగా ఆయనే కలగజేసుకుని కుమారి ఆంటీ యధావిధిగా వ్యాపారం చేసుకునేలా ఆదేశాలు జారీ చేశాడు. ఒక స్ట్రీట్ ఫుడ్ వెండార్ సమస్య మీద సీఎం స్పందించడం అనూహ్య పరిణామం. 

Kumari Aunty

కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన నేపథ్యంలో ఆమె బిగ్ బాస్ షోకి వెళతారని ప్రచారం జరుగుతుంది. దీనిపై కుమారి ఆంటీ స్వయంగా స్పందించారు. మీరు బిగ్ బాస్ షోకి వెళుతున్నారటగా? అని అడగ్గా... బిగ్ బాస్ షోనా? అక్కడికి వెళ్లి వంట చేయాలా? అని అన్నారు. 

కుమారి ఆంటీ కామెంట్స్ పరిశీలిస్తే ఆమెకు బిగ్ బాస్ షో పట్ల అవగాహన లేదు. అలాగే కుమారి ఆంటీకి ఎలాంటి బిగ్ బాస్ ఆఫర్ రాలేదని తెలుస్తుంది. లక్షల్లో ఆమెకు బిజినెస్ జరుగుతుండగా ఒకవేళ ఆఫర్ వస్తే వదిలేసి వెళతారా? అనే చర్చ నడుస్తోంది. 

Kumari Aunty

స్టార్స్ కూడా కుమారి ఆంటీ కస్టమర్స్ అట. ఎన్టీఆర్, ఆలీ తన వద్ద కర్రీలు తెప్పించుకునేవారట. ఇటీవల సందీప్ కిషన్ స్వయంగా వెళ్లి కుమారి ఆంటీ స్టాల్ వద్ద భోజనం చేశాడు. అందుకు గానూ రూ. 10 వేలు కుమారి ఆంటీకి ఇచ్చినట్లు సమాచారం. 
 

Latest Videos

click me!