Guppedantha Manasu 7th February Episode:రాజీవ్ కి చుక్కలు చూపించిన కొత్త హీరో, ఏడిపించేసిన వసుధార..!

First Published | Feb 7, 2024, 8:49 AM IST

వసుని మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని ఆ హీరో అడుగుతాడు. కానీ.. తనకు ఎక్కడికి వెళ్లాలో తెలీదని మీరు వెళ్లిపోండి అని వసు చెబుతుంది. దీంతో అతను వెళ్లిపోతాడు.
 

Guppedantha Manasu

Guppedantha Manasu 7th February Episode:గుప్పెడంత మనసు సీరియల్ కి ఆయువు పట్టు.. రిషి, వసుధారలు. వారి ప్రేమ, బంధమే.. సీరియల్ ని ఇన్ని రోజులు దిగ్విజయంగా నడిపించింది. కానీ.. అనుకోని పరిస్థితుల కారణంగా రిషి క్యారెక్టర్ ని చంపేశారు. ఆ లోటు తీర్చేందుకు కొత్త హీరోని ప్రవేశారు. ఆ హీరో ఫేస్ ని ఈ రోజు ఎపిసోడ్ లో రివీల్ చేశారు. నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
 

Guppedantha Manasu

రిషి బతికే ఉన్నాడని.. తనని తీసుకొని వస్తానంటూ వసుధార బయటకు పరుగులు తీసిన విషయం తెలిసిందే. అక్కడికి రాజీవ్ వచ్చి నానా రభస చేస్తాడు. రిషి లేడు కాబట్టి,.. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చేతిలో తాళితో వసుని ఇబ్బంది పెడతాడు. వసు వదలమని చెబుతున్నా వినిపించుకోకుండా.. తనతో లాక్కొని వెళుతూ ఉంటాడు. అప్పుడే కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ ని ఆపుతాడు. రాజీవ్.. అడ్రస్ ఏమైనా కావాలా అని అడుగుతాడు. కాదు అని ఆ కొత్త హీరో అంటాడు. దీంతో రాజీవ్ వెటకారంగా.. ఏంటి ఇప్పుడు తనని కాపాడుదాం అనుకుంటున్నావా? నువ్వే నా కొత్త హీరో అని అంటాడు.


Guppedantha Manasu

అయితే.. ఆ అమ్మాయిని వదిలేయమని హీరో చెబుతాడు. కానీ రాజీవ్ వదలడు. ఏం చేస్తావ్ అంటే... చంపేస్తాను అని వెనక నుంచి తుపాకీ బయటకు తీస్తాడు. తుపాకీ చూసే సరికి రాజీవ్ లో భయం మొదలౌతుంది. తను తన మరదలు అని, తనకు కాబోయే భార్య అని.. నమ్మించాలని చూస్తాడు. కానీ హీరో నమ్మడు. వసుధార ముఖం చూస్తాడు. వసు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. అతనికి అర్థమై.. గురిపెట్టిన తుపాకీని కిందకు దించకుండా అలానే ఉంచుతాడు. ఇంకాసేపు అక్కడే ఉంటే.. చంపినా చంపేస్తాడేమో అనే భయంతో..వసుని అక్కడే వదిలేసి రాజీవ్ పరుగులు తీస్తాడు. తర్వాత.. వసుని మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయమంటారు అని ఆ హీరో అడుగుతాడు. కానీ.. తనకు ఎక్కడికి వెళ్లాలో తెలీదని మీరు వెళ్లిపోండి అని వసు చెబుతుంది. దీంతో అతను వెళ్లిపోతాడు.

Guppedantha Manasu

మళ్లీ బాధతో వసు తన ఇంట్లోకి వెళ్లిపోతుంది. అక్కడ అందరూ రిషి ఫోటోకి దండ వేసి ఏడుస్తూ ఉంటారు. అది చూసి వసుధారకు కోపం వస్తుంది.. ఎవరు చేశారు ఇలా.. ఎవరు చేశారు అని ఆ పూలు, దండ విసిరేస్తుంది. రిషి ఫోటో చేతుల్లోకి తీసుకుంటుంది. మీకు ఏమీ కాదు రిషి సర్.. అంటూ వసు మాట్లాడుతుంటే.. చూసేవాళ్లకు ఎవరికైనా కంటి వెంట నీరు రావాల్సిందే. ఎమోషన్స్ తో.. ఏడిపించేసింది.

Guppedantha Manasu

ఓవైపు నుంచి దేవయాణి.. అలా చేయకూడదని.. ఇంటికి అరిష్టం అని.. రిషి ఫోటో అక్కడ పెట్టమని చెబుతుంది. కానీ.. ఆ మాటలకు వసుధారకు విపరీతంగా కోపం వస్తుంది. ఇంకోసారి రిషి సర్ లేరు అనే మాట అంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది. ధరణి, మహేంద్ర కూడా చెప్పాలని చూస్తారు.. రిషిని తలుచుకొని మహేంద్ర ఏడుస్తూ ఉంటాడు. అది చూసి వసుధార.. మామయ్య రిషి సర్ కి ఏమీ కాదు.. మా బంధం గురించి అందరికంటే మీకే ఎక్కువ తెలుసు కదా  మీరు కూడా ఎలా నమ్ముతున్నారు..? నేను ఇక్కడ బాగానే ఉన్నాను అంటే...  రిషి సర్ ఎక్కడో బానే ఉంటారు అని చెబుతుంది.

శైలేంద్ర ఏదో చెప్పాలని చూసినా వసుధార చాలా ఫైర్ అవుతుంది. దీంతో.. దేవయాణి రెచ్చిపోతుంది. ఏదో మా రిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావని.. ఈ రోజు రిషి లేడని తెలిసి బాధపడుతున్నావని.. ఓదార్చిపోదామని వస్తే.. నా కొడుకు మీద అరుస్తావేంటి..? వాడు ఏం చేశాడు.. ఇందాక కూడా రిషిని తీసుకువస్తానని వెళ్లావ్ కదా.. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని అడుగుతుంది.
 

Guppedantha Manasu

దీంతో.. వసుధార.. దేవయాణి, శైలేంద్రలపై సీరియస్ అవుతుంది. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అరుస్తుంది. వెళ్లిపొమ్మని గొడవ చేస్తుంది. దీంతో.. శైలేంద్రకు కోపం వచ్చి.. ధరణిని రమ్మని చెబుతాడు. తల్లితో కలిసి బయటకు వెళతాడు. ధరనికి వెళ్లాలని లేకపోయినా... ఏడుస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వాళ్లు వెళ్లిన తర్వాత.. రిషి ఫోటోని గట్టిగా హత్తుకుంటుంది వసు. సంతోషంగా రిషి సర్ కి ఏమీ కాదు అనుకుంటూ నవ్వుకుంటుంది.

Guppedantha Manasu

సీన్ కట్ చేస్తే... అనుపమ ముకుల్ తో మాట్లాడుతూ ఉంటుంది. రిషి చనిపోవడం ఏంటి ముకుల్ గారు అని అడుగుతుంది. హాస్పిటల్ లో డీఎన్ఏ రిపోర్టు చూసిన తర్వాత తన గుండె పగిలిపోయిందని.. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్న తర్వాతే చెప్పాను అని ముకుల్ అంటాడు. ఎన్నిసార్లు చూసినా  డీఎన్ఏ . మహేంద్ర సర్ తో సరిపోలిందని.. అన్ని కోణాల్లో ఎలాంటి మిస్టేక్ లేకుండా చెక్ చేశానని..అది కచ్చితంగా రిషి సర్ దే అని ముకుల్ అంటాడు.

కానీ.. వసుధార నమ్మడం లేదని అనుపమ అంటుంది. దానికి ముకుల్... మనకు రిషి సర్ తో కొద్దిరోజుల పరిచయం మాత్రమేనని.. అలాంటిది వసుధార మేడమ్ కి ఈ విషయం నమ్మడానికి సమయం పడుతుంది అని ముకుల్ అంటాడు. కానీ.. వసుధార తాను బతికుంటే.. రిషి కచ్చితంగా బతికి ఉన్నట్లే అని మొండిగా వాదిస్తోందని అనుపమ అంటుంది. వసుధార మేడమ్ భ్రమలో ఉందని.. తనని బయటకు తీసుకురావాలని  ముకుల్ అంటాడు. అయితే... వసుధార ప్రవర్తన చూస్తే భయంగా ఉందని.. రిషి క్షేమంగా ఉన్నాడని బలంగా నమ్ముతోందని  అనుపమ చెబుతుంది. తర్వాత.. రిషి పై ఎటాక్ చేసింది ఎవరు అనే విషయం పై  అనుపమ ఆరా తీస్తుంది.  రిషి ఉన్న శత్రువు శైలేంద్రేనని.. ఫెస్ట్ సమయంలో జరిగిన విషయాలన్నీ చెబుతుంది. శైలేంద్రే రిషిని కిడ్నాప్ చేసి... ప్రాణాలు తీసి ఉంటాడు అని అనుపమ అంటుంది. కానీ.. శైలేంద్ర మాత్రం చేయలేదు అని ముకుల్ అంటాడు. భద్ర పై అనుమానం ఉందని ముకుల్ బయటపెట్టడం గమనార్హం.

Latest Videos

click me!