ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌: విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ లో అపశృతి, తప్పి పోయిన ఏనుగు!

Published : Oct 05, 2024, 09:05 AM ISTUpdated : Oct 05, 2024, 12:39 PM IST

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ షూటింగ్ లో అనూహ్య పరిమాణం చోటు చేసుకుంది. ఓ ఏనుగు తప్పిపోయినట్లు సమాచారం అందుతుంది.   

PREV
16
 ఏషియానెట్‌ ఎక్స్ క్లూజివ్‌: విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ లో అపశృతి, తప్పి పోయిన ఏనుగు!
Vijay Devarakonda

ఎర్నాకులం జిల్లాలోని కొత్త మంగళం సమీపంలోని భూతత్తాన్ కెట్టులో విజయ్ దేవరకొండ కొత్త మూవీ షూటింగ్ జరుగుతుంది. కాగా ఈ సినిమా షూటింగ్ సెట్‌ నుంచి పుదుపల్లి సాధు అనే  ఏనుగు అడవిలోకి పారిపోవడంతో అక్కడ కలకలం రేగింది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో పుదుపల్లి సాధు అనే ఏనుగు భూతత్తాన్ కెట్టు అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది.ఈ ఏనుగును పట్టుకునేందుకు శుక్రవారం ఉదయం 6:30 గంటలకు తిరిగి గాలింపు చర్యలు ప్రారంభించారు. 


 

26
Vijay Devarakonda

 విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ కోసం ఈ ఏనుగును తీసుకువచ్చారు. అయితే, మరో పెంపుడు ఏనుగుతో గొడవ జరగడంతో పుదుపల్లి సాధు అనే ఏనుగు అడవిలోకి పారిపోయింది. ఈ ఘటనలో గాయపడి పారిపోయిన పుదుపల్లి సాధు  కోసం అటవీ అధికారులు రాత్రి పది గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలను శుక్రవారం ఉదయం పునఃప్రారంభించిన్నట్లు సమాచారం. 

36
Vijay Devarakonda

ఏనుగు అడవిలోకి పారిపోయినప్పటికీ ఎక్కువ దూరం వెళ్లి ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. అయితే, ఏనుగు అడవిలోకి వెళ్లి అక్కడ క్రూర మృగాల బారిన పడితే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేసిన అధికారులు ఏనుగు కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అడవి ఏనుగులు సంచరిస్తున్నాయి.
 

46
Actor Vijay Devarakonda

తప్పిపోయిన ఏనుగు గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. తప్పి పోయిన ఏనుగు తో గొడవ పడిన మరో ఏనుగు కూడా అడవిలోకి పారిపోయి తిరిగి వచ్చింది. ఈ ఏనుగుకు ఎలాంటి గాయాలు కాలేదు. సినిమా షూటింగ్ కోసం మూడు ఆడ ఏనుగులను, రెండు మగ ఏనుగులను తీసుకువచ్చారు. వారం రోజులుగా వాడటుపర లో షూటింగ్ జరుగుతోంది. మిగిలిన ఏనుగులను వాహనాల్లో తిరిగి తీసుకెళ్లారు. 

బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ  తెలుసుకోండి 

56
Vijay Devarakonda

 VD 12 వర్కింగ్ టైటిల్ గా విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్న నూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో మొదటిసారి పోలీస్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. VD 12లో శ్రీలీల, రష్మిక మందాన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. 

66
Vijay Devarakonda

VD 12 సమ్మర్ కానుకగా 2025 మార్చి 23న విడుదల కానుంది. కాగా ఇటీవల విజయ్ దేవరకొండ కల్కి మూవీలో గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి రూ. 1000 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపించాడు. కనిపించిన కాసేపు పవర్ ఫుల్ పాత్రలో అద్భుతం చేశాడు. 

ఇక విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. విజయ్ దేవరకొండ గత చిత్రం ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది. ఖుషి సైతం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న VD 12పైనే విజయ్ దేవరకొండ ఆశలు పెట్టుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. VDలో చాలా ఇంటెన్స్ రోల్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories