సమంత తో నటించొద్దు.. బాలీవుడ్ హీరోను హెచ్చరించింది ఎవరు..? కారణం ఏంటి..?

First Published | Oct 20, 2024, 6:20 PM IST

స్టార్ హీరోయిన్ సమంతతో కలిసి నటించవద్దని బాలీవుడ్ యంగ్ హీరోను హెచ్చరించారట. ఇంతకీ ఆ హీరో ఎవరు..? హెచ్చరించింది ఎవరు..? అసలు కారణం ఏంటి..? 

Samantha

నాగచైతన్యతో విడాకులు తరువాత సమంతలో చాలా మార్పు వచ్చింది. చాలా కాలం డిప్రెషన్ ను మెయింటేన్ చేసిన సమంత ఇక తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. హీరో రేంజ్ లో ఇమేజ్ ను సాధించింది. గ్లామర్ రోల్స్ కు  పుల్ స్టాప్ పెట్టేసి.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మెరుస్తోంది సమంత. 
 

Also Read: పవన్ కళ్యాణ్ ‌- దీపిక పదుకొనే కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా

డివోర్స్ తరువాత సమంత చేసిన సినిమాలన్నీ విమెన్ సెంట్రిక్ సినిమాలే కావడం విశేషం. యశోద, శాకుంతలం, ఓ బేబీ లాంటి సినిమాలు సమంతలోని సత్తాని జనాలకు చాటాయి. ఈసినిమాల్లో ఆమె నటకు ఆడియన్స్ ఫిదా అవ్వడంతో పాటు.. స్టార్ హీరో రేంజ్ లో ఆమెకు ఇమేజ్ నుకట్టబెట్టారు. ఇక సమంత చేసిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 అయితే సూపర్ డూపర్ హిట్ అని చెప్పాలి. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇక్కడి క్లిక్ చేయండి.


Samantha

మరీ ముఖ్యంగా సమంత పండించిన విలనిజం అంతా ఇంతా కాదు. ఈవెబ్ సిరీస్ ఆమెకు బాలీవుడ్ లోప్రత్యేక మైన ఇమేజ్ ను అందించింది. ఈక్రమంలో సమంతకు వరుసగా అవకాశాలు కూడా అందించింది. ఈక్రమంలోనే సినిమాలు వెబ్ సీరస్ లు అంటూ బిజీగా ఉంది సమంత. ప్రస్తుతం సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 

ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ లను డైరెక్ట్ చేసిన రాజ్ డీకేలు ఈ బెబ్ సిరీస్ లను కూడా తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ లో రిచెర్డ్ , ప్రియాంక చోప్రా కలిసి నటించిన వెబ్ సిరీస్ ను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. అయితే ఇందులో ప్రియాంక చేసిన పాత్రనుసమంత పోషిస్తుండగా..రిచర్డ్ పాత్రను బాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్  చేస్తున్నారు.  

 నవంబర్ 7 న రిలీజ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి... అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. అంతే కాదు ఈ ట్రైలర్ లో సమంత యాక్షన్ సీన్స్ అబ్బో అనిపించాయి. దాంతో అంతా ఈవెబ్ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా  అని ఎదురు చూస్తున్నారు. అయితే   సీటడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో సమంతతో పాటు వరుణ్ కూడా జోరుగా పాల్గొంటున్నారు. 
 

పాన్ఇండియా రేంజ్ లోప్రమోషన్లు గట్టిగా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఓ ఇంటర్వ్యూల్ పాల్గోన్న వరుణ్ ధావన్ సమంత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఒప్పుకున్న తరువాత ఇండస్ట్రీకి చెందిన చాలామంది వద్దు అన్నారట. సమంత తో నటించొద్దు.. ఆమెకు హీరోలకు ఉన్నంత ఇమేజ్ ఉంది. ఆమె ఎవరినైనా నటనలో డామినేట్ చేస్తుంది. సిరిస్ హిట్ అయితే క్రెడిట్ అంతా సమంతకు వెళ్ళిపోతుంది అది నీ కెరీర్ కు మంచిది కాదు అని హెచ్చరించారట. 

Honey Bunny Teaser

కాని వరుణ్ మాత్రం  ఈపాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని నటించారట. ఈ విషయాన్ని వరుణ్ చెప్పగానే అంతా షాక్ అయ్యారు. ఇక వరుణ్ వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి. సమంత ఇమేజ్ నిజంగానే సిటడెల్ తో భారీ స్థాయిలో పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

దాదాపు ఏడాదిన్నరగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న సమంత. ఈ సిరిస్ తో మరోసారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వబోతోంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది.  

Latest Videos

click me!