అల్లు అర్జున్ 100 కోట్ల కొత్త ఇల్లు,ఫస్ట్ గెస్ట్ గా పిలవాలనుకున్నది ఆ స్టార్ హీరోనే..చిరంజీవిని కాదు,ఇంతలోనే

First Published | Oct 20, 2024, 6:15 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వచ్చింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కి పాన్ ఇండియా స్థాయి క్రేజ్ వచ్చింది. అల్లు అర్జున్ 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. 

అయితే అల్లు అర్జున్ ఏడాది క్రితం జూబ్లీ హిల్స్ లో దాదాపు 100 కోట్ల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ఇల్లు నిర్మించుకున్నారు. ఈ ఇంటి విషయంలో అల్లు అర్జున్ కి ఒక లోటు ఉండిపోయింది. 100 కోట్లతో నిర్మించుకున్న ఇంటిలో లోటు ఏముంటుంది అని అనుకోవచ్చు.. కానీ అది నిర్మాణ పరంగా కాదు.. ఎమోషనల్ గా. అల్లు అర్జున్ నిర్మించుకున్న ఇంటికి రెండిళ్ళ దూరంలోనే రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇల్లు కూడా ఉంది. అంటే వీళ్ళిద్దరూ నైబర్స్. 


ఇంటి నిర్మాణం పూర్తయ్యాక కృష్ణంరాజుని ఫస్ట్ గెస్ట్ గా ఇంటికి ఆహ్వానించాలని అల్లు అర్జున్ అనుకున్నారు. పక్క పక్క ఇళ్లే కాబట్టి కృష్ణం రాజు లాంటి లెజెండ్ ని ఆహ్వానించాలని బన్నీ భావించాడు. ఒక రోజు ఆయనతో కలసి డిన్నర్ చేయాలని కూడా బన్నీ అనుకున్నారట. కానీ అల్లు అర్జున్ ఇల్లు నిర్మాణదశలో ఉండగా.. కొన్ని నెలలలో పూర్తవుతుంది అనగా కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారు. 

కృష్ణంరాజు మరణించినప్పుడు అల్లు అర్జున్ స్వయంగా తన మనసులో మాట బయటపెట్టారు. తన కోరిక తీరకుండా కృష్ణంరాజు గారు వెళ్లిపోయారని బన్నీ బాధపడ్డాడట. అత్యంత విలాసవంతమైన హంగులతో బన్నీ తన కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. 

అల్లు అర్జున్ తన ఇంటికి కొద్ది దూరంలోనే తన ఆఫీస్ ని కూడా నిర్మించుకున్నారు. 2 ఎకరాల విస్తీరణంలో ఈ ఇంటితో పటు గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో తన పాన్ ఇండియా మార్కెట్ ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. 

Latest Videos

click me!