సమంత, బాలయ్య, రవితేజ చిత్రాలకు దిక్కుమాలిన సెంటిమెంట్.. పాపం బతిమాలిన హీరోయిన్

First Published | Nov 8, 2024, 9:40 AM IST

సినిమాలు హిట్ అవ్వాలంటే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. ఆ సెంటిమెంట్స్ ని బయటకి చెప్పారు కానీ ఫాలో అవుతుంటారు. రిలీజ్ డేట్లు, హీరోయిన్ల ఎంపిక విషయంలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి.

Rana Daggubati

సినిమాలు హిట్ అవ్వాలంటే హీరోలు, దర్శకులు, నిర్మాతలు కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. ఆ సెంటిమెంట్స్ ని బయటకి చెప్పారు కానీ ఫాలో అవుతుంటారు. రిలీజ్ డేట్లు, హీరోయిన్ల ఎంపిక విషయంలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. రానా దగ్గుబాటి ఒక దిక్కుమాలిన సెంటిమెంట్ ని బయటకి తీసి నటి వరలక్ష్మి శరత్ కుమార్ పై సెటైర్లు వేశారు. 

varalaxmi

ఇటీవల జరిగిన ఐఫా ఈవెంట్ లో రానా దగ్గుబాటి, తేజ సజ్జా హోస్ట్ లుగా సందడి చేశారు. రానా, తేజ సజ్జా వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వివాదం కూడా అవుతున్నాయి. నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి రానా, తేజ సజ్జా చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇదెక్కడి దిక్కుమాలిన సెంటిమెంట్ అంటూ కామెంట్స్ చేసున్నారు. 


తేజ సజ్జా మాట్లాడుతూ.. వరలక్ష్మి గారికి క్యారెక్టర్ ఇస్తే మాత్రం ఆవిడ ప్రాణం పెట్టి నటిస్తారు అని చెప్పాడు. రానా రియాక్ట్ అవుతూ.. అవును లే ఈవిడ ప్రాణం పెడతారు.. డైరెక్టర్లు ఆవిడ ప్రాణం తీసేస్తారు అని అని సెటైర్ వేశారు. వెంటనే తేజ సజ్జా.. ఆమె ఏ చిత్రాల్లో చనిపోయారో చెబుతూ.. హనుమాన్ లో చనిపోయింది, వీర సింహారెడ్డిలో చనిపోయింది.. క్రాక్ లో చనిపోయారు.. యశోదలో కూడా చనిపోయారు అంటూ తేజ సజ్జా నవ్వులు పూయించారు. 

వరలక్ష్మి రియాక్ట్ అవుతూ.. గాయ్స్ నేను బతికిన చిత్రాలు కూడా చాలా ఉన్నాయి అంటూ బతిమాలుకుంది. సరేలే మిమ్మల్ని బతికిస్తే ఆ సినిమాలు చచ్చిపోయి అంట అంటూ రానా ఫన్నీ కామెంట్స్ చేశారు. దీనితో ఆడిటోరియం మొత్తం నవ్వుల్లో మునిగిపోయింది. సినిమా హిట్ అవ్వాలంటే వరలక్ష్మి పాత్రని చంపేయాలి.. ఇది కొత్త సెంటిమెంట్ అని అర్థం వచ్చేలా తేజ, రానా కామెంట్స్ చేయడం విశేషం. 

వరలక్ష్మి నటించిన క్రాక్, వీర సింహా రెడ్డి, యశోద, హను మాన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. వీటన్నింటిలో వరలక్ష్మి పాత్ర చనిపోతుంది. పాపం వరలక్ష్మికి ఇలాంటి సెంటిమెంట్ తగులుకుంది. భవిష్యత్తులో దర్శకులు హిట్స్ కోసం వరలక్ష్మి పాత్ర చనిపోయేలా మరిన్ని కథలు రాస్తారేమో. 

Latest Videos

click me!