భాక్సాఫీస్ కింగ్: ‘దేవర’క్లోజింగ్ కలెక్షన్, ఇదీ ఎన్టీఆర్ స్టామినా

First Published | Nov 8, 2024, 8:57 AM IST

 ఇప్పుడు ఈ సినిమా ఓటిటిల్లోకి సైతం వచ్చేసింది. ఈ నేపధ్యంలో సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ సారి చూస్తే భాక్సాపీస్ కింగ్ ఎన్టీఆర్ అని అర్దమవుతుంది. టాక్ కు సంభందం లేకుండా కలెక్షన్స్ కుమ్మరించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది.

Devara


యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర ఊహకు అందని విధంగా కలెక్షన్స్ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది.

కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రికార్డ్ లు క్రియేట్ చేసింది.   రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే  సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని దాటేసి దుమ్ము   లేపింది. 

Junior NTRs Devara India collection report out

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో దసరా  హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.వర్కింగ్ డేస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ మాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

ఇప్పుడు ఈ సినిమా ఓటిటిల్లోకి సైతం వచ్చేసింది. ఈ నేపధ్యంలో సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని ఓ సారి చూస్తే భాక్సాపీస్ కింగ్ ఎన్టీఆర్ అని అర్దమవుతుంది. టాక్ కు సంభందం లేకుండా కలెక్షన్స్ కుమ్మరించిన తీరు ఆశ్చర్యపరుస్తుంది.
 


Devara


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా 400 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది. కొరటాల శివకు ఇది అతి పెద్ద రికార్డ్. అలాగే తెలుగు వెర్షన్ తో హిందీ వెర్షన్ బాగా వర్కవుట్ అవటం కలిసొచ్చింది.

అయితే తమిళనాడు, కేరళలలో మాత్రం లాస్ వెంచర్ గా మిగిలింది. అక్కడ అతి తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అయితే తెలుగు, హిందీ భారీగా వర్కవుట్ కావటంతో సినిమాకు గ్రాస్ ఓ రేంజిలో వచ్చేసింది.

Junior NTR starrer Devara collection report out

  
ఈ సినిమా యూఎస్ మార్కెట్లో కూడా భారీ వసూళ్లు ప్రీమియర్స్ తోనే అందుకున్న సంగతి తెలిసిందే. అలా నార్త్ అమెరికాలో అయితే దేవర ఫైనల్ రన్ ని ముగించుకుంది.

ఇక ఈ సినిమా అక్కడ ఫైనల్ గ్రాస్ గా 6.07 మిలియన్ డాలర్లు గ్రాస్ ని అందుకొని లాంగ్ రన్ ని ముగించుకుంది. దీనితో నార్త్ అమెరికా మార్కెట్ నుంచి దేవర 50 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుంది అని చెప్పాలి.  

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,


తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 112 కోట్ల రూపాయలకు జరగగా, నిర్మాతకు 22 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయి అన్నమాట. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ప్రీమియర్స్ లోనే 22 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ లో 60 కోట్ల రూపాయిల గ్రాస్, 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,

అలాగే కర్ణాటక 16 కోట్ల రూపాయిలు, తమిళనాడు లో 3 కోట్ల రూపాయిలు, కేరళలో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక హిందీ వెర్షన్ లో ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓవరాల్ గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 197 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 396 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. 

#Devara, #NTR, #JahnaviKapoor, Koratala siva,

ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించి దేవర చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు.  తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి.  తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది. లాంగ్ రన్ లో దేవర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.

Latest Videos

click me!