Karthika Deepam: కార్తీకదీపంలోకి వంటలక్క ఎంట్రీ.. శౌర్యకు, సౌందర్యకు వంట చేసిపెట్టిన వంటలక్క!

Published : Jun 04, 2022, 08:11 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 4వ తేదీన ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Karthika Deepam: కార్తీకదీపంలోకి వంటలక్క ఎంట్రీ.. శౌర్యకు, సౌందర్యకు వంట చేసిపెట్టిన వంటలక్క!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిరుపమ్ గురించి ఆలోచిస్తూ ఆనంద పడుతుంటుంది. అయితే అప్పుడే శోభ జ్వాలను ఓ ప్లేస్ కు రమ్మని అక్కడ ఒకరిని ఒకరు తిట్టుకుంటారు. అతర్వాత జ్వాలను శోభ పిలుస్తుంది. నువ్వు నన్నెందుకు పిలుస్తున్నావ్ అంటూ అడుగుతుంది.
 

26

నిన్ను అవమానించడానికి పిలుస్తున్న అని మనసులో తిట్టుకుంటుంది. దీన్ని ఎలా అయిన ఒప్పించాలి అని కళ్ళవేళ్ల పడుతుంది. అయిన ఒప్పుకోకపోవడంతో శౌర్యకు అందరూ వస్తున్నారు నువ్వు రా అని పిలుస్తూ నిరుపమ్ కూడా వస్తున్నాడు అని చెప్తుంది. దీంతో వాళ్ళని బయట కలుస్తా నీ పార్టీకి నేను ఎందుకు రావాలంటూ మొండికి వేస్తుంది.
 

36

ఇక ఆ మాట విన్న శోభ నువ్వు రాకపోతే డాక్టర్ సాబ్ కూడా ఫీల్ అవుతాడు నువ్వు రావాల్సిందే అంటూ చెప్పి వెళ్తుంది.  అతర్వాత జ్వాలా ఇది ఎందుకు ఇంత ఫోర్స్ చేస్తుంది అనుకోని ఏమైతేనేం డాక్టర్ సాబ్, తింగరి వస్తున్నారు కదా అని సంతోష పడుతుంది.
 

46

అతర్వాత కొత్త సీరియల్ వంటలక్క క్యాస్ట్ కార్తీకదీపం సీరియల్ లోకి వచ్చి ప్రమోట్ చేసుకుంటారు. వంటలక్క వరలక్ష్మి, మురళి వస్తారు. మురళికి సౌందర్య, వరలక్ష్మికి శౌర్య సాయం చేస్తారు. ఇక మరోవైపు హిమ.. శౌర్యను తలుచుకొని బాధ పడుతుంది.
 

56

శౌర్య నీ పక్కనే నేను ఉన్నా నా గురించి చెప్పలేను అంటూ ఫీల్ అవుతుంది. నిన్ను నిరుపమ్ ని ఒకటి చెయ్యడానికి ఏమైనా చేస్తా అనుకుంటుంది. అంతేకాదు ఈ శోభ అడ్డు వస్తుంది అని ఫీల్ అయ్యి శౌర్య ఆనందమే నా ఆనందం అని సంతోష పడుతుంది.
 

66

ఇక అతర్వాత సీరియల్ మొత్తం వంటలక్క సీరియల్ ప్రమోషన్ నడుస్తుంది. ఈ సీరియల్ అందరూ చూడాలంటూ ప్రమోట్ చేస్తారు. మరీ రేపటి భాగంలో ఈ కార్తీక దీపం సీరియల్ లో ఏ ట్విస్ట్ చోటు చేసుకుందో చూడాలి.. ప్రస్తుతం సీరియల్ లో అయితే ట్విస్ట్ లతో కొనసాగుతుంది. 
 

click me!

Recommended Stories