కార్తీకదీపంలో వంటలక్క పాత్ర ముగిసిందా.. కథ మొత్తం యూ-టర్న్?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 08, 2021, 02:00 PM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు రేటింగ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. 

PREV
110
కార్తీకదీపంలో వంటలక్క పాత్ర ముగిసిందా.. కథ మొత్తం యూ-టర్న్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ కు రేటింగ్ లో కూడా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో చూద్దాం.
 

210

హాస్పిటల్ లో మోనిత కార్తీక్ తో మాట్లాడిన మాటలను హిమ సౌర్య తో చెబుతూ బాధపడుతుంది. ఇక సౌర్య ఇదంతా నిజం కాదు అని చెప్పినా కూడా హిమ మాటలకి ఇదంతా నిజమేనేమో అని అనుకుంటుంది.
 

310

మరోవైపు దీప మౌనంగా ఉండటంతో సౌందర్య ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. దీప మాత్రం తన బాధను మొత్తం చెప్పుకుంటుంది. పిల్లలకు ఎటువంటి కొత్త అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంటూ మాట్లాడుతుంది.
 

410

 ఇక కార్తీక్ హాస్పిటల్ లో ఆలోచించుకుంటూ ఉండగా.. డాక్టర్ భారతి వచ్చి మాట్లాడుతుంది. ఇక కార్తీక్ మోనిత తనను ఇంకా బాధ పెడుతుంది అని తన బాధ చెప్పుకుంటాడు.
 

510

భారతి మోనిత కడుపులో ఉన్న బిడ్డ గురించి మాట్లాడుతుంటే కార్తీక్ కోపంగా రియాక్ట్ అవుతాడు. మళ్లీ ఆ విషయం గురించి మాట్లాడొద్దు అంటూ భారతి తో అంటాడు.
 

610

 జైల్లో మోనిత కార్తీక్ పెయింటింగ్ చూసి మురిసిపోతుంది. అప్పుడే సుకన్య వచ్చి మీరు చెప్పిన పని చేశాను అంటూ మాట్లాడుతుంది. ఇక ఈ పెయింటింగ్ గురించి తనతో చెప్పుకుంటుంది.
 

710

ఆనందరావు సౌందర్య తో మోనిత గురించి చెబుతూ కోపం అవుతాడు. పేపర్ లో వచ్చిన విషయం గురించి తనపై వాదిస్తున్నారు అని, వెటకారం చేస్తున్నారు అని సౌందర్య చెబుతూ బాధపడతాడు.
 

810

ఇక జైల్లో మోనిత దగ్గరికి సుకన్య వచ్చి మాట్లాడుతుంది. ఇక సుకన్య మోనితకు ఒక గుడ్ న్యూస్ చెబుతుంది. మోనిత సంతోష పడుతూ మరో ప్లాన్ చెబుతుంది.
 

910

మరోవైపు దీప మోనిత గురించి రోషిణి కి చెప్పి జీవితాంతం జైలు లో ఉండేలా చేయాలని రోడ్డుపై ఆలోచించుకుంటూ వస్తుంది. అంతలోనే వెనకాల నుండి ఒక కారు వేగంగా దూసుకొస్తోంది.
 

1010

 తరువాయి భాగం లో దీపకు యాక్సిడెంట్ జరిగినట్లు అనిపిస్తుంది. ఇదంతా చూస్తే మోనిత దీప ని చంపడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కథ మొత్తం మళ్లీ మొదటికి వచ్చేలా ఉంది.

click me!

Recommended Stories