Superstar Krishna: కలిసి 20 సినిమాలు చేసినా ఆ హీరోయిన్‌తో ఒక్క మాట మాట్లాడని కృష్ణ.. ఫోన్‌ చేస్తే నో చెప్పేసింది

Published : Oct 07, 2025, 09:35 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ, అలనాటి స్టార్‌ హీరోయిన్‌ వాణిశ్రీ లకు మధ్య గొడవేంటి? ఆమెతో ఆయన ఎందుకు మాట్లాడలేదు? 30ఏళ్ల తర్వాత కృష్ణ ఫోన్‌ చేస్తే వాణిశ్రీ ఎందుకు నో చెప్పింది? 

PREV
15
వాణిశ్రీతో సూపర్‌ స్టార్‌ కృష్ణకి గొడవ

సూపర్‌ స్టార్‌ కృష్ణ భోళా మనిషి, లోపల ఏదీ ఉంచుకోరు, మొహం మీదనే అనేస్తారనే కామెంట్‌ ఇండస్ట్రీలో ఉంది. ఆయనతో పనిచేసిన చాలా మంది ఈ విషయాన్ని చెప్పారు. తన సినిమా పోయినా కూడా ఓపెన్‌గా చెబుతారని, అందులో దాపరికం ఉండదని అంటుంటారు. ఏ గొడవైనా అప్పటికప్పుడు క్లీయర్‌ చేస్తారని అంతా చెబుతారు. కానీ ఓ స్టార్‌ హీరోయిన్‌ విషయంలో మాత్రం కృష్ణ చాలా బెట్టు చేశాడట. కనీసం ఆమెతో మాట్లాడలేదట. అసలు ఎలాంటి గొడవే లేకుండా హీరోయిన్‌తో మాట్లాడలేదట. కెరీర్‌ మొత్తంలో ఆమెని దూరం పెట్టాడట. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు అలనాటి తార వాణిశ్రీ. అప్పట్లో సావిత్రి తర్వాత తెలుగు సినిమాని ఓ ఊపు ఊపేసిన నటి ఆమె. ఇంకా చెప్పాలంటే సావిత్రి సినిమాలు మానేశాక వాణిశ్రీ సినిమా ఇండస్ట్రీని రూల్ చేసిందని చెప్పొచ్చు.

25
కృష్ణ, వాణిశ్రీ కాంబినేషన్‌లో ఇరవైకి పైగా సినిమాలు

వాణిశ్రీ ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతోపాటు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌ బాబు వంటి వారితో కలిసి నటించారు. వారికి అప్పట్లో వాణిశ్రీ బెస్ట్ ఆప్షన్‌గా ఉండేది. అద్భుతమైన నటి కూడా. అందుకే ఆమె కోసం స్టార్స్ కూడా వెయిట్‌ చేసేవారు. ఈ టాప్‌ హీరోలందరితోనూ వాణిశ్రీ పదుల సంఖ్యలో సినిమాలు చేశారు. అలా సూపర్‌ స్టార్‌ కృష్ణతో కూడా చాలా సినిమాలే చేశారు. వీరి కాంబోలో ఇరవైకి పైగానే సినిమాలు వచ్చాయి. అప్పట్లో ఈ జంటని అత్యంత సక్సెస్‌ఫుల్‌ జోడీగా పిలిచేవారు. అయితే వీరి కాంబినేషన్‌లో ఎక్కువగా ఫ్యామిలీ మూవీస్ రూపొందాయి. వాటిలో కొన్ని పరాజయం చెందితే, కొన్ని మంచి ఆదరణ పొందాయి. `మహాబలుడు`, `మరుపురాని కథ`, `కన్నె మనసులు`, `జగత్‌ ఖిలాడీలు`, `చీకటి వెలుగులు`, `స్త్రీ జన్మ`, `అసాధ్యుడు`, `పచ్చని సంసారం` వంటి చిత్రాలు బాగానే ఆడాయి.

35
ఎన్టీఆర్‌ తప్ప ఏఎన్నార్‌, కృష్ణ ఏనాది ఆ మాట అనలేదు

అయితే కృష్ణ, వాణిశ్రీ కలిసి దాదాపు ఇరవై సినిమాలు చేసినా ఏ రోజు కూడా మాట్లాడుకోలేదట. కనీసం సెట్‌లో హాయ్‌.. భాయ్‌ కూడా లేదట. తనని ఆయన పట్టించుకునేవారు కాదు, తాను ఆయన్ని పట్టించుకునేదాన్ని కాదు అని తెలిపారు వాణిశ్రీ. ఏబీఎన్‌ రాధాకృష్ణకి ఇచ్చిన ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఆమె ఈ విషయాన్ని తెలిపారు. మీ నటన గురించి ఎవరు ఎక్కువగా ప్రశంసించేవారు ఆయన అడగ్గా, ఒక్క ఎన్టీఆర్‌ తప్ప తన నటన గురించి ఎవరూ పొగడ లేదని తెలిపారు వాణిశ్రీ. ఎన్టీఆర్‌తోపాటు కృష్ణంరాజు అప్పుడప్పుడు ప్రశంసించేవారట. కానీ ఏఎన్నార్‌, కృష్ణ ఎప్పుడూ బాగా చేశావని, బాగున్నావనిగానీ అనలేదట. ఏఎన్నార్‌తో ఏజ్‌ గ్యాప్‌ ఉంది కావచ్చు. వాళ్లంతా పెద్ద స్టార్స్ కావచ్చు, ఈ చిన్న పిల్లతో ఏముందిలే అనుకోవచ్చు. కారణం ఏదైనా తనని అభినందించలేదని వెల్లడించారు వాణిశ్రీ. ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్‌ తో తనకు పడని విషయాన్ని బయటపెట్టారు.

45
20 సినిమాలు చేసినా ఒక్క రోజు కూడా మాట్లాడుకోలేదు

కృష్ణతో కలిసి ఎన్నో సినిమాలు చేశాం. దర్శకుడు షాట్‌ చెప్పినట్టు చేసేవాళ్లం. కానీ ఏనాడూ ఆయన తనని విష్ చేయలేదని, తాను ఆయన్ని విష్‌ చేయలేదని, వచ్చామా? షూటింగ్‌ చేశామా? వెళ్లిపోయామా? అనేలా తమ మధ్య షూటింగ్‌ జరిగిందని తెలిపారు వాణిశ్రీ. అయితే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవు, మనస్పర్థాలు లేవు, బేధాభిప్రాయాలు లేవు. కానీ ఒక్క సారి కూఆ మాట్లాడుకోలేదని తెలిపారు వాణిశ్రీ. కృష్ణ చాలా మంచి వారని, అందరిని బాగా చూసుకుంటారని, తన సినిమాల కలెక్షన్ల లెక్కలు కూడా ఆయన మైండ్‌లో ఉంటాయని, వ్యక్తిగా చాలా గొప్ప మనిషి అని, కానీ తన విషయంలో మాత్రం ఎందుకో ఆ గ్యాప్‌ ఉండేదని తెలిపారు వాణిశ్రీ.

55
30ఏళ్ల తర్వాత కృష్ణ ఫోన్‌ చేస్తే నో చెప్పిన వాణిశ్రీ

ఈ క్రమంలో దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఒక రోజు తనకు ఫోన్‌ చేశాడట కృష్ణ. ఓ మూవీ లో నటించాలని అడిగారట. అందులో సవతి తల్లిగా నటించాలని అడిగాడట కృష్ణ. సినిమాలో ఆమె పాత్ర చివర్లో హీరోకి విషం ఇచ్చి చంపుతుంది. ఈ విషయం చెప్పాక ఆ సినిమా చూసిందట వాణిశ్రీ. చూశాక తాను ఈ మూవీ చేయలేనని, ఇలాంటి పాత్ర తనకు వద్దు అని మొహం మీదనే చెప్పేసిందట. మూడు నాలుగు సార్లు కృష్ణ అడిగినా వాణిశ్రీ నో చెప్పిందట. అలా ఆ ఒక్కసారి మాత్రమే తనతో కృష్ణ మాట్లాడారని, అది తప్ప ఇప్పటి వరకు మాట్లాడలేదని తెలిపింది వాణిశ్రీ. ఆమె కామెంట్స్ వైరల్‌గా మారాయి. మరి వాణిశ్రీతో కృష్ణకి ఇబ్బంది ఏంటి? వారి మధ్య ఏం జరిగిందనేది మాత్రం పెద్ద సస్పెన్స్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories