Kichcha Sudeep Remuneration: బిగ్‌ బాస్‌ షోకి సుదీప్‌ పారితోషికం ఎంతో తెలుసా? మొత్తం వెనక్కి ఇవ్వాల్సిందేనా?

Published : Oct 07, 2025, 08:28 PM IST

బిగ్‌ బాస్‌ కన్నడ షో క్లోజ్‌ అయ్యింది. ఈ షో నిర్వహణకు సంబంధించి సరైన అనుమతులు లేవని చెప్పి పర్యావరణ అధికారులు క్లోజ్‌ చేశారు. ఈ క్రమంలో హోస్ట్ గా చేస్తున్న సుదీప్‌ పారితోషికం వివరాలు ఆసక్తికరంగా మారాయి. 

PREV
15
సుదీప్‌ హోస్ట్ గా కన్నడ బిగ్‌ బాస్‌ 12వ సీజన్‌

బిగ్‌ బాస్‌ రియాలిటీ షోకి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌తోపాటు శాండల్‌వుడ్‌లోనూ ఈ షో రన్‌ అవుతున్న విషయం తెలిసిందే. ఇండియాలో బిగ్‌ బాస్‌ షో మొదటగా ప్రారంభమైంది హిందీలో. ఆ తర్వాత స్టార్ట్ అయ్యింది కన్నడలోనే. కన్నడలో కలర్స్ కన్నడ టీవీలో ఈ షో రన్‌ అవుతుంది. మొదటి నుంచి ఈ షోకి కన్నడ స్టార్‌ కిచ్చ సుదీప్‌ హోస్ట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ఇది 12వ సీజన్‌కి చేరుకుంది. ఇందులో ఓసారి మినీ సీజన్‌ నిర్వహించారు. ఇప్పుడు బిగ్‌ బాస్‌ కన్నడ సీజన్‌ 12 నడుస్తోంది.

25
క్లోజ్‌ అయిన కన్నడ బిగ్‌ బాస్‌ 12 హౌజ్‌

గత వారమే `బిగ్‌ బాస్‌ కన్నడ 12` షో ప్రారంభమైంది. ఇంతలోనే పెద్ద దెబ్బ పడింది. కన్నడ బిగ్‌ బాస్‌ షోని ఆపేశారు. నిబంధనలను ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై 'బిగ్ బాస్ కన్నడ సీజన్ 12' షో రన్‌ అవుతున్న బిదాడిలోని జోలీవుడ్ స్టూడియోను రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి మంగళవారం సీజ్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరు సాయంత్రం 7 గంటలలోపు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) జారీ చేసిన నోటీసు తర్వాత, రెవెన్యూ శాఖ అధికారులు స్టూడియోకు చేరుకుని, పోటీదారులందరూ సాయంత్రం 7 గంటలలోపు ఇంటి నుండి బయటకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో కన్నడ బిగ్‌ బాస్‌ మూతపడే పరిస్థితి నెలకొంది. అయితే షో మొత్తం క్లోజ్‌ చేస్తారా? తాత్కాలికంగా బంద్‌ చేస్తున్నారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పర్యావరణానికి సంబంధించిన చర్యలు చేపట్టాక మళ్లీ కొనసాగుతుందా అనేది చూడాలి.

35
బిగ్‌ బాస్‌ కన్నడ 12 వ సీజన్‌ కంటెస్టెంట్లు వీరే

ఇదిలా ఉంటే 19 మందితో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇందులో అభిషేక్‌, అశ్వినీ జీ, అశ్వినీ ఎస్‌, ధనుష్‌, చంద్రప్రబ, ధృవంత్‌, గిల్లి నటా, జాన్వీ, కావ్య, మంచు భాసిని, మల్లమ్మ, మాలు పీ, రక్షిత, రాషిక, స్పందన, సుధీర్‌, సతీష్‌, ఆర్‌జే అమిత్‌, కరిబసప్పా వంటి టీవీ, సినిమా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ పాల్గొన్నారు. వీరిలో మొదటి వారం ఆర్‌జే అమిత్‌, కరిబసప్పా మొదటి వారం ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం హౌజ్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఇంటికి వెళ్లిపోతున్నారు. మరి వీళ్ల పరిస్థితేంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఈ షోకి కిచ్చ సుదీప్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఈ షో కోసం ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది.

45
బిగ్‌ బాస్‌ కన్నడ 12 షోకి సుదీప్‌ పారితోషికం

ప్రారంభంలో ఈ షో కోసం ఐదేళ్లకిగానూ మొత్తంగా రూ. 20కోట్లు అని అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత ఇందులో మార్పులు తీసుకొచ్చారు. దీంతో సుదీప్ పారితోషికం పెరిగింది. గత సీజన్‌కి ఆయన 9 కోట్లు పారితోషికంగా అందుకోగా, ఇప్పుడు రూ.12కోట్లు ఇస్తున్నట్టు సమాచారం. ఇది మిగిలిన లాంగ్వేజెస్‌లోని హోస్ట్ ల కంటే చాలా తక్కువ అని చెప్పొచ్చు. తెలుగులో సుమారు ముప్పై కోట్ల వరకు నాగార్జున పారితోషికం తీసుకుంటున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతి రూ.75 కోట్లు తీసుకుంటున్నారట. మలయాళంలో మోహన్‌ లాల్‌ రూ.24 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ ఏకంగా రూ. 150కోట్లు బిగ్‌ బాస్‌ కోసం పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది ఈ లెక్కన సుదీప్‌ చాలా తక్కువ పారితోషికం తీసుకుంటున్నారని చెప్పొచ్చు.

55
బిగ్‌ బాస్‌ పారితోషికం సుదీప్‌ వెనక్కి ఇస్తారా?

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్‌ బాస్‌ కన్నడ 12 షో క్యాన్సిల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ పారితోషికం వెనక్కి ఇస్తారా? కొంత గ్యాప్‌ తర్వాత మళ్లీ షో ప్రారంభిస్తారా అనేది చూడాలి. పర్యావరణ అధికారులు, ప్రభుత్వం నిర్ణయం బట్టి ఈ షో భవిష్యత్‌ ఆధారపడి ఉంటుంది. ఇక కిచ్చ సుదీప్‌ మన తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితమే. ఆయన `ఈగ` సినిమాలో విలన్‌గా నటించారు. దీంతోపాటు `బాహుబలి`లో కాసేపు అలరించారు. ఆ తర్వాత `సైరా నరసింహారెడ్డి`లో కీలక పాత్రలో మెరిశారు. వీటికంటే ముందు `రక్తచరిత్ర`లోనూ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించారు సుదీప్‌. ప్రస్తుతం కన్నడలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories