Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?

Published : Jun 25, 2026, 03:47 PM IST

ఇటీవల ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుతో మరోసారి ఆడియెన్స్ ని పలకరించిన వడ్డే నవీన్‌ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మరి మొదటి భార్యతో ఎందుకు విడిపోయారు? ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఏంటనేది చూస్తే. 

PREV
15
పదేళ్ల బ్రేక్‌ తర్వాత వచ్చిన వడ్డే నవీన్‌

వడ్డే నవీన్‌ దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` చిత్రంలో నటించాడు. రాశీ సింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి కనీసం ముప్పై లక్షల కలెక్షన్లు కూడా రాలేదు. దీనికి సుమారు రూ.12కోట్లు ఖర్చు చేయగా మొత్తానికి మొత్తం పోయింది. ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. గతంలోనే రెండు సార్లు ఆయన సినిమాలకు బ్రేక్‌ తీసుకున్నారు. వరుసగా సినిమాలు ఆడకపోతే బ్రేక్‌ తీసుకున్నారు, ఆ తర్వాత మళ్లీ ఒక్క సినిమా చేస్తే అది కూడా ఆడలేదు. దీంతో మళ్లీ పదేళ్లు బ్రేక్‌ తీసుకున్నాడు.

25
ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుతో డిజాస్టర్‌

ఇప్పుడు `ట్రాన్సఫర్‌ త్రిమూర్తులు` మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో వడ్డే నవీన్‌ నెక్ట్స్ ఏం చేయబోతున్నాడనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కావడం గమనార్హం. ఇది దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వడ్డే నవీన్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? మళ్లీ బ్రేక్‌ తీసుకుంటాడా? క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకొని తానేంటో నిరూపించుకుంటాడా? అనేది చూడాలి. కానీ జగపతిబాబు తరహాలో మంచి పాత్రలు చేస్తూ, మళ్లీ తానేంటో నిరూపించుకుంటే హీరోగా బౌన్స్ బ్యాక్‌ కావచ్చు అనేది ఇండస్ట్రీ వర్గాలు, క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.

35
మొదటి భార్యతో వడ్డే నవీన్‌ విడాకులు

అయితే వడ్డే నవీన్‌ కెరీర్‌ ఇలా కావడానికి, ఆయన ఒకప్పుడు స్టార్‌ హీరోగా రాణించి, ఆ తర్వాత డౌన్‌ కావడానికి ఆయన మ్యారేజ్‌ లైఫ్‌ ఓ కారణమని అంటుంటారు. వడ్డే నవీన్‌కి నందమూరి ఛాముండేశ్వరితో పెళ్లి అయ్యింది. ఆమె నందమూరి తారకరామారావు మనవరాలు. ఆయన కొడుకు రామకృష్ణ కూతురు. వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. అప్పట్లో ఎన్టీఆర్‌తో.. వడ్డే నవీన్‌ తండ్రి వడ్డే రమేష్‌ పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించారు. వడ్డే రమేష్‌ అప్పట్లో స్టార్‌ ప్రొడ్యూసర్‌. ఎన్టీఆర్‌తో సినిమాలు చేసి సక్సెస్‌ కొట్టారు. దీంతో వారి మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ రిలేషన్‌తోనే వడ్డే నవీన్‌కి రామకృష్ణ కూతురుని ఇచ్చి పెళ్లి చేశారు. ప్రారంభంలో బాగానే ఉన్నారు, కానీ మ్యారేజ్‌ అయిన కొన్ని రోజులకే విడాకులు తీసుకున్నారు.

45
డైవర్స్ వల్లే వడ్డే నవీన్‌ కెరీర్‌ డౌనా?

వడ్డే నవీన్‌, ఛాముండేశ్వరి మధ్య గొడవ ఏంటనేది తెలియదు, కానీ ఆమె విషయంలో నవీన్‌ వెనక్కి తగ్గలేదట. బాలకృష్ణ, చంద్రబాబుతో సహా చాలా మంది చెప్పారట. కానీ వినలేదు. విడిపోయారు. అయితే తమ అమ్మాయికి విడాకులు ఇచ్చిన కారణంగానే వడ్డే నవీన్‌ని హీరోగా సక్సెస్‌ కాకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన వద్దకు మంచి కథలు రాకుండా చేశారని, హీరోగా తొక్కే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ ఆ ప్రచారం నడుస్తూనే ఉంది. స్టార్‌గా రాణించిన నవీన్‌ సడెన్‌గా పడిపోవడానికి ఈ డైవర్సే మెయిన్‌ కారణం అంటున్నారు. సరైన సినిమాలు పడకపోవడం, వరుస ఫెయిల్యూర్స్ రావడంతో తనకు తానుగానే సినిమాల నుంచి తప్పుకునేలా చేశారనే కామెంట్‌ వినిపిస్తుంది. అయితే దీనిపై దర్శకుడు నందం హరిశ్చంద్రరావు స్పందించారు. భార్యాభర్తల మధ్య ఏదో జరిగింది. ఏదో బలమైన కారణం ఉంది. అందుకే విడిపోయారు. ఆమె విషయంలో వడ్డే నవీన్‌ ఏమాత్రం తగ్గలేదు అని తెలిపారు.

55
వడ్డే నవీన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇవ్వడానికి కారణం ఇదే

కెరీర్‌ డౌన్‌కి కారణం చెబుతూ, ఆయన మొదటి సినిమా ఆచితూచి చేశారని, వడ్డే రమేష్‌ చాలా కేర్‌ తీసుకొని చేశారని తెలిపారు. అలా 1997లో `కోరుకున్న ప్రియుడు` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నవీన్‌. తొలి చిత్రంతోనే హిట్‌ కొట్టాడు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత `పెళ్లి`తో మరో హిట్‌ కొట్టాడు. ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. దీంతో వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. రెండు మూడేళ్లు గ్యాప్‌ లేకుండా హిట్లు కొట్టాడు. మంచిస్టార్‌ స్టేటస్‌ వచ్చింది. నిర్మాతలు, దర్శకులు క్యూ కట్టారు.ఆ ఆవేశంలో కథలు చూసుకోకుండా సినిమాలు చేశాడట. అవి వరుసగా పరాజయాన్ని మిగిల్చాయని, వరుసగా పదికిపైగా ఫ్లాప్‌ లు రావడంతో సినిమాలకు బ్రేక్‌ తీసుకున్నాడని దర్శకుడు నందం హరిశ్చంద్రరావు వెల్లడించారు. మొదటి భార్య ఛాముండేశ్వరికి విడాకులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు ఒక వ్యాపారవేత్త కూతురు మీనాని చూసి ఇష్టపడ్డాడట నవీన్‌. ఆమెని పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు, ఒక కూతురు ఉన్నారని తెలిపారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories