ANR: శ్రీరామదాసు మూవీ చూసి మైమరచిపోయిన ఏఎన్నార్ దంపతులు, ఆమెని మాత్రమే ఇంటికి పిలిచి ఏం చేశారో తెలుసా ?

Published : Jun 25, 2026, 03:12 PM IST

అక్కినేని నాగేశ్వర రావు దంపతుల నుంచి ఎవరికీ దక్కని గౌరవాన్ని సింగర్ సునీత దక్కించుకున్నారు. శ్రీరామదాసు మూవీ తర్వాత జరిగిన ఆసక్తికర సంఘటనని సునీత వివరించారు. 

PREV
15
Akkineni Nageswara Rao

టాలీవుడ్ లో ఇటీవల కాలంలో ది బెస్ట్ ఫిమేల్ సింగర్స్ లో సునీత ఒకరు. సునీత తన కెరీర్ లో 3వేలకు పైగా పాటలు పాడారు. గులాబీ చిత్రంలోని ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనే సాంగ్ సునీతకి మంచి గుర్తింపు తీసుకువచ్చింది. ఆ తర్వాత సునీత వెనుదిరిగి చూడలేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా ఎదిగింది. సింగర్ గా మాత్రమే కాకుండా ఎందరో హీరోయిన్లకు, నటీమణులకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు.

25
నన్ను ట్రోల్ చేశారు

తన పాటలకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. సింగర్ గా తాను, తన కుటుంబం ప్రశాంతంగా జీవించగలిగేంత సంపాదించగలిగాను అని అన్నారు. ఇంత సాధించినప్పటికీ జీవితంలో నేను తీసుకున్న ఒక పెద్ద నిర్ణయాన్ని చాలా మంది ట్రోల్ చేశారు అని సునీత తన రెండో పెళ్లి గురించి పరోక్షంగా ప్రస్తావించారు. డబ్బు కోసమే ఆ పని చేసినట్లు కొందరు ఈజీగా మాట్లాడేశారు.

35
బాపు గారు నా కోసం ఆ లెటర్ రాశారు

నేను చేసింది డబ్బు కోసమే అయితే ఆల్రెడీ నేను డబ్బు సంపాదించాను కదా. డబ్బుతో పాటు పేరు హోదా కూడా పొందాను. నా గురించి నేను చెప్పుకోవడం అంతగా ఇష్టం ఉండదు. కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. బాపు గారి లాంటి లెజెండ్ నన్ను ఆశీర్వదిస్తూ.. చి.ల. సౌ సునీతకు అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ.. నీ వీరాభిమాని బాపు అని లెటర్ రాశారు. ఇంత గొప్ప విషయం ఇంకెవరికైనా జరిగిందా ? నాకు జరిగింది.

45
ఆయన సొంత కూతురిలా చూసుకున్నారు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నన్ను తన సొంత కూతురిలా చూసుకున్నారు. ఇది కూడా ఎవరికీ జరగలేదు. శ్రీరామదాసు మూవీ చూశాక అక్కినేని నాగేశ్వర రావు గారు, ఆయన సతీమణి అన్నపూర్ణమ్మ గారు నన్ను ఇంటికి ఆహ్వానించారు. స్వయంగా వారి చేతులతో నాకు భోజనం వడ్డించారు.

55
శ్రీరామదాసులో ఆ రెండు పాటలకు ఏఎన్నార్ దంపతులు ఫిదా

శ్రీరామదాసు మూవీలో చాలు చాలు చాలు, ఇదిగిదిగో నా రాముడు అనే రెండు పాటలు పాడాను. ఆ రెండు పాటలు ఒకదానికొకటి సంబంధం లేనివి. అయినప్పటికీ అద్భుతంగా పాడానని నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఏఎన్నార్ గారు నాకు శిరస్సు వంచి నమస్కారం చేశారు. నీ ప్రతిభ కోసమే ఇలా చేస్తున్నా అని అన్నారు. అంతటి గొప్ప అదృష్టం ఇంకెవరికైనా దక్కిందా అని సునీత ప్రశ్నించారు.

Read more Photos on
click me!

Recommended Stories