Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్

Published : Dec 09, 2025, 07:03 PM IST

Ustaad Bhagat Singh: పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ ఫస్ట్ సాంగ్‌ ప్రోమో విడుదలైంది. స్టయిలీష్‌ లుక్‌లో పవన్‌ వేసిన స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి. అభిమానులకు ట్రీట్‌లాగా ఉందని చెప్పొచ్చు. 

PREV
14
ఈ ఏడాది రెండు సినిమాలతో పవన్‌ రచ్చ

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. `హరి హర వీరమల్లు`, `ఓజీ` చిత్రాలతో ఆడియెన్స్ ని అలరించారు. ముఖ్యంగా ఈ ఏడాది పవన్‌ అభిమానులు పండగ చేసుకున్నారు. ఓ రకంగా వాళ్ల ఆకలి తీరిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఆయనకు సరైన హిట్‌ లేదు. దీంతో ఆ లోటుని `ఓజీ` తీర్చింది. `హరి హర వీరమల్లు` డిజప్పాయింట్‌ చేసినా `ఓజీ` దుమ్ములేపింది. పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని సాధించింది. పవన్‌ కి సరిపోయే సినిమా పడితే వసూళ్ల వర్షం ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది.

24
`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` నుంచి ఫస్ట్ సింగిల్‌ ప్రోమో

ఇక ఇప్పుడు మరో సినిమాతో సందడి చేయబోతున్నారు పవన్‌. ఆయన నటించిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీ రచ్చ స్టార్ట్ చేస్తున్నారు టీమ్‌. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీలీల మరో హీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు టీమ్‌. మొదటి సాంగ్‌ని విడుదల చేయబోతున్నారు.

34
అలరిస్తోన్న `దేఖ్‌లేంగే సాలా` సాంగ్‌ ప్రోమో

అందులో భాగంగా `ఉస్తాద్‌భగత్‌ సింగ్‌` మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో విడుదల చేశారు. `దేఖ్‌ లేంగే సాలా` పేరుతో సాగే ఈ పాట ప్రోమో మంగళవారం సాయంత్రం విడుదల చేయగా, అది ఆకట్టుకుంటోంది. ఇందులో పవన్‌ మార్క్ స్టెప్పులు దుమ్ములేపేలా ఉన్నాయి. పవన్‌ హ్యాట్‌ పెట్టుకునే తీరు అదిరిపోయేలా ఉంది. ఇది అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. పూర్తి పాట ఈ నెల 13న విడుదల కానుంది.

44
కాప్‌ యాక్షన్‌ డ్రామాగా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`

 ఈ సినిమాకి సంబంధించిన పవన్‌ కళ్యాణ్‌ పార్ట్ పూర్తయ్యింది.  సినిమా చిత్రీకరణ కూడా దాదాపు పూర్తయ్యిందని సమాచారం.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది.  పోలీస్‌ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇందులో కొంత పొలిటికల్‌ టచ్‌ కూడా ఉంటుందని సమాచారం. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories