ఊర్వశి రౌతేలా పేరు చెప్పగానే బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4 లాంటి బోల్డ్ మూవీస్ గుర్తుకు వస్తాయి. గ్లామర్ పాత్రలతో ఊర్వశి రౌతేలా బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తూ అలరించింది. తెలుగులో ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య, బ్రో లాంటి చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
ప్రస్తుతం ఊర్వశి రౌతేలా గుస్సేటియా అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలో ఈ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఎప్పుడూ వార్తల్లో ఉండే ఊర్వశి రౌతేలా ఇటీవల ఓ వీడియో కారణంగా సోషల్ మీడియాలో ఆమె పెద్దఎత్తున వైరల్ అయ్యారు. ఆమె ప్రైవేట్ వీడియో లీక్ కావడమే అందుకు కారణం.
ఊర్వశి రౌతేలా బాత్ రూమ్ వీడియో లీక్ అయి ఇంటర్నెట్ లో దుమారం రేపింది. అసలు ఊర్వశి రౌతేలా ఇంటి బాత్ రూమ్ నుంచి వీడియో ఎలా లీక్ అయింది అంటూ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే.. అది ఊర్వశి రౌతేలా ఇంటి బాత్రూమ్ వీడియో కాదు.
ఆమె నటిస్తున్న గుస్సేటియా చిత్రంలో బాత్రూమ్ సన్నివేశంలో నటించిందట. దీనిపై ఊర్వశి తాజాగా స్పందించింది. ఆ వీడియో లీక్ కావడంతో చాలా బాధపడ్డా. అది నా పర్సనల్ వీడియో కాదు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. నేను నటిస్తున్న చిత్రంలోనిది ఆ సీన్.
అయినా సినిమా రిలీజ్ కాకముందే లీక్ చేశారు. ఇంకెవరికి ఇలా జరగకూడదు అని ఊర్వశి రౌతేలా కోరింది. సినిమాలో సన్నివేశం అని ఊర్వశి రౌతేలా స్వయంగా చెబుతోంది. వీడియో లీక్ అయ్యాక ఆమె తన మ్యానేజర్ కి ఫోన్ చేసి ఈ వీడియో గురించి చర్చించింది. ఆ ఆడియో కూడా లీక్ అయింది. ఇదంతా చూస్తుంటే ఊర్వశి రౌతేలా.. గుస్సేటియా చిత్ర యూనిట్ కావాలనే చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించినట్లు అర్థం అవుతోందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.