అతను ప్యాంటు విప్పి, నా చేతితో ట్రై చేసాడంటూ హీరోయిన్ ఆవేదన

Published : Jul 28, 2024, 02:42 PM IST

కొంతదూరం వెళ్లాక..అతను తన చేతిని తీసుకుని తన ప్యాంట్ పై వేసుకున్నాడు. తన ప్యాంట్ జిప్ ని తీసాడు. 

PREV
18
 అతను ప్యాంటు విప్పి, నా చేతితో  ట్రై చేసాడంటూ హీరోయిన్ ఆవేదన
Tillotama Shome


ఇంతకు ముందు రోజుల్లోలాగ ఎవరూ కూడా తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనలను తలుచుకుంటూ కూర్చోవటం లేదు. సోషల్ మీడియా వచ్చాక మిగతా జనాలతో వాటిని షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రెటీలు ఈ విషయంలో ముందు ఉంటున్నారు. తాజాగా  బాలీవుడ్ నటి తిలోతమా షోమ్( Tillotama Shome) తనకు డిల్లీలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని చెప్పుకొచ్చింది. 

28
Tillotama Shome


తిలోతమా షోమ్( Tillotama Shome) అనేక  ఇండిపెండెంట్ షార్ట్ ఫిలింలో యాక్ట్ చేసి మంచి గుర్తింపు పొందింది. 2018 లో, 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో సర్ చిత్రంలో ఇంటి పనిమనిషి పాత్రను పోషించినందుకు తన నటనకు ఉత్తమ నటిగా (క్రిటిక్స్) ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.  అలాగే డిల్లీ క్రైమ్, ది నైట్ మేనేజర్ , లస్ట్ స్టోరీస్ 2 వంటి వెబ్ సీరిస్ లతో పేరు తెచ్చుకుంది. ఆమె తన జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాన్ని తన అబిమానులతో షేర్ చేసుకుంది.

38
Tillotama Shome


ఓ ఇంటర్వూలో తిలోతమా షోమ్ మాట్లాడుతూ... తాను డిల్లీలో ఉన్నప్పుడు అసలు ఊహించటానికి వీల్లేని ఓ సంఘటన జరిగిందని చెప్పింది. ఆమె శీతాకాలం సాయింత్రం బస్ కోసం వెయిట్ చేస్తు ఉన్నానని, ఏ బస్సు ఆగటం లేదని, మెల్లిగా చీకటి పడుతోందని తాను కంగారుపడుతున్నాని అంది. అప్పుడే ఓ ఊహించని సంఘటన జరిగింది.

48
Tillotama Shome


అక్కడ ఆ టైమ్ లో పెద్దగా జనం లేరు. ఈ లోగా హఠాత్తుగా ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ఆరుగురు మనుష్యులు దిగారు. వాళ్లు చూసి భయపడి తాను దూరం జరిగి పారిపోవటానికి ప్రయత్నించానని, తనను తాను రక్షించుకోవటానికి ప్రయత్నించాను అంది.

58
Tillotama Shome


ఈ లోగా పిల్లి కూతలు మొదలయ్యాయి. నేను పరుగెడుతున్నాను. ఈ లోగా ఒకరు చిన్న రాయి విసిరారు. నేను కొద్ది దూరం వెళ్లగలిగా. అక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నాను. నేను గట్టిగా పరుగెట్టినా ఫలితం లేదని అర్దం అయ్యింది. ఎందుకంటే వారి దగ్గర కారు ఉంది. అలాగే వాళ్లు నా వెనకాల పరుగెట్టగలరు. ఏం చేయాలో అర్దం కాలేదు.

68
Tillotama Shome viral post


తర్వాత నేను రోడ్డు మధ్యగా వచ్చి లిప్ట్ అడగటం మొదలెట్టాను. చాలా కార్లు వేగంగా వెళ్లిపోతున్నాయి. ఎవరూ ఆపటం లేదు. ఈలోగా దూరం నుంచి వస్తున్న ఓ కాైరు వచ్చి ఆగింది.నేను వెంటనే ఆ కారు వెక్కి ఆ కొత్త వ్యక్తి ప్రక్కన కూర్చుని ఊపిరి పీల్చుకున్నాను. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలబడలేదు.

78


కొంతదూరం వెళ్లాక..అతను తన చేతిని తీసుకుని తన ప్యాంట్ పై వేసుకున్నాడు. తన ప్యాంట్ జిప్ ని తీసాడు. నాకు భయం వేసింది. నా చేతిని లాక్కుంటూంటే భయంతో ఒక్కటి కొట్టాను. అక్కడే తగలటంతో ఆ బాధతో అతను సడెన్ గా కారు ఆపి, నన్ను గెట్ అవుట్ అంటూ అరిచి, దింపేసి వెళ్లిపోయాడు అంటూ తన బాధాకరమైన అనుభవం చెప్పుకొచ్చింది. అలాంటి పరిస్దితులు వచ్చినప్పుడు అధైర్యపడకండా ఫైట్ చేసి తప్పించుకోవాలని చెప్పుకొచ్చింది. 

88
Tillotama Shome

 
ఇక ప్రస్తుతం తిలోతమా షోమ్ ఢీల్లీ క్రైమ్, లస్ట్ స్టోరీస్ 2 వంటి మూవీస్ లో నటించి అందరినీ ఆకట్టుకుంది. తిలోతమా పలు మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు. 

click me!

Recommended Stories