రెడ్ రోజ్ లా ఆకర్షిస్తున్న ఊర్వశీ రౌటేలా అందం.. మిర్రర్ ముందు మత్తుగా ఫోజులు..

First Published | Sep 30, 2023, 11:27 AM IST

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా సౌత్ లో వరుస చిత్రాలతో దుమ్ములేపుతోంది. స్పెషల్ సాంగ్స్ తో ఆడియెన్స్ ను ఊర్రూతలూగిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 
 

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌటేలా సౌత్ చిత్రాలతో అదరగొడుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో మెరుస్తూ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతోంది. స్పెషల్ అపియరెన్స్ తో అదరగొడుతోంది. ఐటెం సాంగ్స్ కు ప్రత్యేక నటిగా మారిపోయింది.
 

గతేడాది తమిళంలో విడుదలైన ‘ది లెజెండ్’ చిత్రంతో సౌత్ లో అడుగుపెట్టింది. ఆ వెంటనే ఐటెం సాంగ్ హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో మెగాస్టార్ సరసన ‘బాస్ పార్టీ’కి గ్లామర్ స్టెప్పులేసి ఆకట్టుకుంది. ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.


దాంతో తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు పెట్టింది పేరుగా మారింది ఊర్వశీ రౌటేలా. అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ ‘బ్రో : ది అవతార్’లోనూ ఐటెం సాంగ్స్ లో నటించి మెప్పించింది. తన అందం, డాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. 
 

రీసెంట్ గా విడుదలైన ‘స్కంద’తోనూ ‘మాస్ మామా’ అంటూ ఆడియెన్స్ లో జోష్ పెంచింది. ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఇలా వరుస చిత్రాల్లో ఐటెం సాంగ్స్ తో మెప్పిస్తూ మోస్ట్ వాంటెడ్ నటిగా మారిపోయింది. 
 

మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. అదిరిపోయే పోస్టులు పెడుతూ తన అభిమానులు, నెటిజన్లను ఫిదా చేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఫొటోషూట్లు కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది. బ్యూటీఫుల్ లుక్స్ లో కట్టిపడేస్తోంది. 
 

తాజాగా ఈ ముద్దుగుమ్మ రెడ్ ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. మిర్రర్ ముందుకు తన అందానికి మెరుపులు దిద్దుతూ ఆకట్టుకుంది. రెడ్ రోజ్ లా నిగనిగలాడే అందంతో ఆకర్షించింది. ఊర్వశీ గ్లామర్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతూ.. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. తెలుగులో ఈ బ్యూటీ ఓకే చెప్పిన సినిమాలు రిలీజ్ కూడా అయ్యిపోయాయి. ప్రస్తుతం తెలుగులో మరొక్క ప్రాజెక్ట్ ‘బ్లాక్ రోజ్’ ఉంది. షూటింగ్ జరుపుకుంటోంది. ఇక హిందీలో ‘దిల్ హై గ్రే’లో నటిస్తూ బిజీగా ఉంది.

Latest Videos

click me!