భర్తతో నటి హరితేజ విడాకులు..? క్లారిటీ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ. ఏమంటుందంటే..?

First Published | Sep 30, 2023, 9:58 AM IST

ఈమధ్య చిన్న చిన్న స్టార్ల నుంచి..స్టార్ సెలబ్రిటీల వరకూ.. ఎంతో మంది విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఈక్రమంలోనే బుల్లితెర, వెండితెర తార హరితేజ్ విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలుహల్ చల్ చేస్తున్న క్రమంలో.. ఈ విషయంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. 

బుల్లితెరతో పాటు..వెండితెరపై కూా తెలుగు ప్రేక్షకులను అలరించిన  నటి హరితేజ. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెలివిజన్  యాంకర్ గా  తన కెరీర్ ను స్టార్ట్ చేసిన హరితేజ... సీరియల్ నటిగా, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి మంచి  పాత్రలు చేసింది. తన నటనతో డైలాగ్ టైమింగ్ తో  మెప్పించింది. 
 

ముఖ్యంగా ఆమె చేసిన కామెడీ రోల్స్.. క్యామియో రోల్స్ సినిమాల్లో బాగా వర్కౌట్ అయ్యింది. ఇక అదేక్రేజ్ తో మరో రికార్డ్ కూడా తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో ఫస్ట్ సీజన్ లో అవకాశం సాధించింది. బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ గా బయటకు వచ్చి మరింత ఫేమస్ అయ్యింది హరితేజ.  ప్రస్తుతం ఒక పక్క మంచి సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది.
 


అయితే అప్పుడున్నంత యాక్టీవ్ గా హరితేజ ఇప్పుడు లేదు. అంతే కాదు ఆమె చేతిలో పెద్దగా అవకాశాలు కూడా లేవు. మధ్యలో బరువు పెరగడం, తన బిడ్డ ఆలనా పాలనాచూడటంకోసం స్క్రీన్ కు కాస్త గ్యాప్ ఇవ్వడంతో హరితేజ నటనకు దూరం అయినట్టు అయిపోయింది. అయినాసరే  తను కంప్లీట్ గా సినిమాలకు దూరం అవ్వలేదు అంటోంది హరితే.  అందులోను అనసూయలాంటి యాంకర్లు సినిమాల్లో బాగా డిమాండ్ రావడంతో హరితేజ లాంటి వారికి పనిలేకుండాపోయింది.  

ఇక 2015 లో హరితేజ, దీపక్ అనే కన్నడియన్ ను పెళ్ళి చేసుకుంది. వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది. ఇక బిడ్డ పుట్టాకా హరితేజ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. దీంతో ఆమె కష్టపడి బరువు తగ్గి.. నాజూగ్గా తయారయ్యింది. ఇక అప్పటినుంచి చిట్టిపొట్టి బట్టలు వేసుకొని హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ భామ.. ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తుంది. 
 

అయితే హరితే. తన కూతురును తన తల్లి దగ్గర వదిలి.. తన ఫ్రెండ్ తో కలిసి  ఫారెన్  వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఈ విషయంలోనే రకరకాల డౌట్లు వెల్లడిస్తున్నారు నెటిజన్లు. హరితేజ విడాకులు తీసుకోబోతుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు. తాజాగా ఆమె తన సోషల్ మీడియా ఫ్యాన్స్ తో ముచ్చటించగా.. ఆమెను డైరెక్ట్ గా అడిగేస్తున్నారు కూడా. 

తాజాగా ఈ విడాకుల వార్తలపై గట్టిగా స్పందించింది హరితేజ.  ఓ నాలుగు రోజులు సోషల్ మీడియాలో కనిపించకపోవడంతో.. చంపేసేలా  ఉన్నారు. ఏవోవే రాసేస్తున్నారు అని వెంటనే తన భర్తతో ఉన్న ఫోటోను షేర్ చేశారు హరితేజ. దాంతో తన ఫ్యాన్స్ కు. నెటిజన్లకు ఓ క్లారిటీఇచ్చేసింది బ్యూటీ. 

Latest Videos

click me!