బాలయ్య గురించి నెగిటివ్ గా విన్నా..ఆయన అలాంటివారు కాదు, ఐటెం బ్యూటీ కామెంట్స్ వైరల్

First Published | Sep 27, 2024, 5:06 PM IST

నందమూరి బాలకృష్ణ పబ్లిక్ ఈవెంట్స్ లో, ఇతర కార్యక్రమాల్లో దూకుడు స్వభావంతో ఉంటారు. ముక్కుసూటి వ్యక్తిత్వం అనే ట్యాగ్ బాలయ్యకి ఉంది. పబ్లిక్ ఈవెంట్ లో బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంతటి వివాదం సృష్టించాయో తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ పబ్లిక్ ఈవెంట్స్ లో, ఇతర కార్యక్రమాల్లో దూకుడు స్వభావంతో ఉంటారు. ముక్కుసూటి వ్యక్తిత్వం అనే ట్యాగ్ బాలయ్యకి ఉంది. పబ్లిక్ ఈవెంట్ లో బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు ఎంతటి వివాదం సృష్టించాయో తెలిసిందే. ప్రస్తుతం మహిళల విషయంలో చిన్న తప్పు జరిగినా చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పేరుతో వెలుగులోకి వచ్చేస్తోంది. 

నటీమణులు తమకి ఎదురైన సంఘటనలని, వేధింపులని ధైర్యంగా బయట పెడుతున్నారు. గతంలో రాధికా ఆప్టే కూడా బాలయ్యపై నెగిటివ్ గా కామెంట్స్ చేసింది. కాగా తన గ్లామర్ తో, ఐటెం సాంగ్స్ తో యువతని ఆకట్టుకుంటున్న ఊర్వశి రౌతేలా బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 


ఆమె బాలయ్యపై పాజిటివ్ గా కామెంట్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బాలయ్య 109వ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. బాలయ్య గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ విన్నాను. కానీ నాతో మాత్రం ఆయన చాలా గౌరవంగా, మంచిగా ఉన్నారు. 

బాలకృష్ణతో నాకు ఎలాంటి అసౌకర్యం లేదు. ఆయన గురించి విన్న నెగిటివ్ కామెంట్స్ కరెక్ట్ కాదు అని ఊర్వశి తెలిపింది. సెట్స్ లో బాలకృష్ణ చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ప్రతి మనిషిలో కొన్ని షేడ్స్ ఉంటాయి. కానీ ఎదుటివారితో ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. బాలయ్యతో కలసి నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అని ఊర్వశి ప్రశంసలు కురిపించింది. 

Latest Videos

click me!