బోల్డ్ కామెంట్స్ : ఆ ఇద్దరు ప్లేయర్లతో ట్రైయాంగిల్ ఎఫైర్ పెట్టుకోవాలని ఉంది.. ఊర్వశి రౌతేలా

First Published | Nov 15, 2024, 3:08 PM IST

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కామెంట్స్ కూడా బోల్డ్ గా ఉంటాయి. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె తనకి ఇద్దరు స్టార్ ప్లేయర్లతో ట్రైయాంగిల్ ఎఫైర్ పెట్టుకోవాలని ఉన్నట్లు తెలిపింది. 

ఉర్వశి ప్రేమ వ్యవహారాల గురించి వార్తలు తరచుగా వస్తుంటాయి. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించాయి. ఇంటర్వ్యూలో ఆమె ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో ​​రొనాల్డో, లియోనెల్ మెస్సీలతో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడపాలని ఉన్నట్లు సరదాగా తెలిపింది. 

వెండితెరపై గ్లామర్ గా కనిపించే ఊర్వశి నోట అప్పుడప్పుడూ ఇలాంటి బోల్డ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలా ఉండగా తెలుగులో కూడా ఆమెకి ఐటెం సాంగ్స్ లో ఛాన్సులు వస్తున్నాయి. బ్రో, వాల్తేరు వీరయ్య, ఏజెంట్ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేసింది. 


ఓ ఈవెంట్‌లో ఉర్వశి ఈ వ్యాఖ్యలు చేసింది. యాంకర్ ఆమెని ప్రశ్నిస్తూ ఎవరితో అయినా మీరు ట్రయాంగిల్ లవ్ స్టోరీ సాగించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీనికి ఆమె ఫుట్ బాల్ లెజెండ్స్ క్రిస్టియానో రోనాల్డో, మెస్సి పేర్ల చెప్పింది. 

నా పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వస్తూనే ఉంటాయి. వాటిని నిత్యం పట్టించుకుంటూ ఉండడం టైం వేస్ట్. నా వర్క్, కెరీర్ పై ఫోకస్ పెడతాను. న గురించి వచ్చిన రూమర్స్ ని ఆల్రెడీ ఖండించాను అని ఊర్వశి పేర్కొంది. క్రికెటర్ రిషబ్ పంత్ తో ఊర్వశి కి ఎఫైర్ ఉన్నట్లు గతంలో రూమర్స్ వచ్చాయి. 

నాకు మద్దతు ఇచ్చే వ్యక్తులతో ఉంటూ, నా విలువలకు కట్టుబడి ఉంటూ ఒత్తిడిని తట్టుకుని లక్ష్యాలపై దృష్టి పెడతాను అని ఆమె అన్నారు. గ్లామర్ రోల్స్ తో గుర్తింపు పొందిన ఊర్వశి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. 

ఉర్వశి తదుపరి చిత్రం NBK109. ఇందులో ఆమె నందమూరి బాలకృష్ణతో కలిసి నటిస్తోంది. ఆమె ఇతర చిత్రాలలో బాప్, వెల్కమ్ టు ది జంగిల్, కసూర్ 2 ఉన్నాయి. 

ఉర్వశి రౌతేలా

వెల్కమ్ టు ది జంగిల్‌లో ఆమె అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, దిశా పటాని, రవీనా టాండన్, లారా దత్తా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరేష్ రావల్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్, శ్రేయస్ తల్పాడే, కృష్ణ అభిషేక్, జాకీ ష్రాఫ్, అఫ్తాబ్ శివదాసానిలతో కలిసి నటిస్తోంది. ఆమె ఇటీవల కథానాయికగా నటించిన కాల్ మి బే విడుదలైంది. 

Latest Videos

click me!