తెలుగు డైరెక్టర్ ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చిన రజనీ.. ఆయన సమాధానం విని సూపర్ స్టార్ నోరు మెదపలేదు

First Published | Nov 15, 2024, 2:27 PM IST

రీమేక్ చిత్రాలు సులభంగా చేయొచ్చు అనుకుంటారు. కానీ రీమేక్స్ చేయడం కూడా పెద్ద సవాలే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి అంచనాలు ఉంటాయి. కొందరు క్రియేటివ్ దర్శకులు రీమేక్ చిత్రాల్లో సోల్ పాయింట్ ని మాత్రమే తీసుకుని ఇతర సన్నివేశాలని నేటివిటీకి అనుగుణంగా మార్చేస్తుంటారు.

Rajinikanth

రీమేక్ చిత్రాలు సులభంగా చేయొచ్చు అనుకుంటారు. కానీ రీమేక్స్ చేయడం కూడా పెద్ద సవాలే. ఆల్రెడీ హిట్ అయిన సినిమా కాబట్టి అంచనాలు ఉంటాయి. కొందరు క్రియేటివ్ దర్శకులు రీమేక్ చిత్రాల్లో సోల్ పాయింట్ ని మాత్రమే తీసుకుని ఇతర సన్నివేశాలని నేటివిటీకి అనుగుణంగా మార్చేస్తుంటారు. గతంలో ఘరానామొగుడు, ఆ మధ్యన గబ్బర్ సింగ్ చిత్రాలు మార్పులు చేయడం వల్ల సూపర్ హిట్స్ అయ్యాయి.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా కొన్ని రీమేక్ చిత్రాలు చేశారు. ఘరానా మొగుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే. రీమేక్ అయినప్పటికీ ఆయన తన స్టైల్ ఫాలో అవుతారు. శ్రీదేవితో 1978లో రాఘవేంద్ర రావు 16 ఏళ్ళ వయసు అనే చిత్రం తెరకెక్కించారు. ఇది తమిళ చిత్రం 16 వయతినిలే చిత్రానికి రీమేక్. భారతీరాజా దర్శకత్వంలో శ్రీదేవి, రజనీకాంత్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో సిల్వర్ జూబ్లీ మూవీ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 


ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ రాఘవేంద్ర రావుకి వచ్చింది. ఈ చిత్ర విశేషాలని రాఘవేంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తమిళ మూవీ చూశాను. అంతా బావుంది.. నాకు క్లైమాక్స్ నచ్చలేదు. ఎండింగ్ లో కాస్త ట్రాజిడీ అన్నట్లుగా ముగించారు. ఈ తరహా క్లైమాక్స్ ని తమిళ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. తెలుగులో వర్కౌట్ కాదు. నాకు కూడా పర్సనల్ గా నచ్చలేదు. కచ్చితంగా హ్యాపీ ఎండింగ్ ఉండాలి. 

Sridevi

కానీ ఆల్రెడీ సూపర్ హిట్ అయిన చిత్ర క్లైమాక్స్ మార్చితే సినిమా మొత్తం చెడిపోవచ్చు. అది కూడా ప్రమాదమే. అయినప్పటికీ రిస్క్ తీసుకున్నా. చివర్లో హీరో విలన్ ని చంపి జైలుకి వెళతాడు. హీరోయిన్.. హీరో ఎప్పుడు వస్తాడా.. అతనితో తాళి ఎప్పుడు కట్టించుకుందామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. హీరో వస్తాడా రాడా అని హీరోయిన్ ఎదురుచూస్తుండగానే సినిమాని ఒక కన్ఫ్యూజన్ తో, బాధతో ఎండ్ చేశారు. హీరో వచ్చే వరకు ఆమె జీవితం అంతే అన్నట్లుగా తమిళ వర్షన్ ముగించారు. 

sridevi

హీరో వచ్చి ఆమె మెడలో తాళి కడితే తెలుగు ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి తెలుగులో క్లైమాక్స్ ని నేను ఇంకా పొడిగించాను. రైల్వే స్టేషన్ లో మల్లి ( శ్రీదేవి) ఎదురు చూస్తూ ఉండగా ట్రైన్ వస్తుంది. శ్రీదేవి తన ప్రియుడి కోసం అన్ని బోగీలు ఆశగా వెతుకుతుంది. కానీ చంద్రమోహన్ కనిపించడు. తెలుగులో చంద్రమోహన్ హీరోగా.. మోహన్ బాబు విలన్ గా నటించారు. చంద్రమోహన్ తిరిగి రాలేదు అని బాధతో శ్రీదేవి చనిపోవడానికి బయలుదేరుతుంది. ఇంతలో మళ్ళీ అంటూ చంద్రమోహన్ కేకలు వినిపిస్తాయి. 

ఒక అద్భుతమైన ఎమోషనల్ సీన్ తో చంద్రమోహన్ ఆమె మెడలో తాళి కడతారు. ఆ విధంగా రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. ఇక చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఫస్ట్ కాపీ సిద్ధం చేశారు. తెలుగు రీమేక్ లో క్లైమాక్స్ మార్చి కథని చెడగొట్టారు అని ఎవరో రాఘవేంద్ర రావుపై కమల్ హాసన్, రజనీకాంత్ లకు కంప్లైంట్ చేశారట. శ్రీదేవి రాఘవేంద్ర రావుకి ఫోన్ చేసి.. రజనీకాంత్, కమల్ మీ ఇంటికి వస్తున్నారట అని చెప్పింది. ఆశ్చర్యపోయా, సరే రానీలే అనుకున్నా. ఇద్దరూ మా ఇంటికి వచ్చారు. రాఘవేంద్ర రావు గారు మీరు సినిమా మొత్తం బాగా తీశారు.. కానీ క్లైమాక్స్ మార్చడం వల్ల ఆ ఫీల్ పోతుంది.. సినిమా ఫ్లాప్ అవుతుంది అని రజనీకాంత్ హెచ్చరించారు. 

తమిళంలో ఉన్న క్లైమాక్స్ ఉంచితే మంచిది అని చెప్పారు. నేను తిరిగి రజనీకాంత్ ని ప్రశ్నించా. హీరోయిన్ అలా జీవితాంతం ఎందుకు అయోమయంలో ఉండాలి ? హీరో జైల్లో చనిపోయాడు అని చెప్పండి ఒకే అది ఒక ఎండింగ్ అవుతుంది... లేదు ఇంకొన్ని నెలల్లో వస్తాడు అని చెప్పండి పర్వాలేదు.. కానీ అసలు వస్తాడో రాడో తెలియదు అంటూ అయోమయంతో ఎందుకు ముగించాలి అని రాఘవేంద్ర రావు ప్రశ్నించారు. దీనికి రజనీ దగ్గర సమాధానం లేదు. ఇంతగా చెబుతున్నారు కాబట్టి.. నా క్లైమాక్స్ తో సినిమా రిలీజ్ చేస్తా.. మొదటి రోజు టాక్ బావుంటే కొనసాగిస్తా.. టాక్ బాగాలేకుంటే మీ క్లైమాక్స్ దగ్గరే ఆపేస్తా అని రాఘవేంద్రరావు చెప్పారు. కట్ చేస్తే ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో 16 ఏళ్ళ వయసు చిత్రం సూపర్ హిట్ అయింది. రాఘవేంద్ర రావు నమ్మకం వమ్ము కాలేదు.  

Latest Videos

click me!