హీరోయిన్ శ్రీలీల హ్యాండ్ బ్యాగ్ లో ఎవరూ ఊహించని ఒక వస్తువు... అది లేకుండా కాలు బయటపెట్టదా?

First Published | Aug 10, 2024, 12:07 PM IST

హీరోయిన్ శ్రీలీల ఓ వస్తువు ఖచ్చితంగా తన హ్యాండ్ బ్యాంగ్ లో ఉండేలా చేసుకుంటుందట. మొబైల్, మేకప్ కిట్ తో పాటు ఎక్కడికి వెళ్లినా అది ఉండాల్సిందేనట. 
 

Sreeleela


హీరోయిన్ శ్రీలీల అనతికాలంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పెళ్లిసందD చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది శ్రీలీల. ఆ చిత్రం కమర్షియల్ గా ఆడకున్నా శ్రీలీల గ్లామర్, ఎనర్జీకి టాలీవుడ్ మేకర్స్ ఫిదా అయ్యారు. వరుసగా అరడజనుకు పైగా చిత్రాలకు శ్రీలీల సైన్ చేసింది. 

ధమాకా మూవీతో భారీ హిట్ అందుకుంది. ధమాకా మూవీ సాంగ్స్ బాగా పాప్యులర్ అయ్యాయి. సదరు సాంగ్స్ లో రవితేజను డామినేట్ చేసేలా శ్రీలీల ఎనర్జీ ఉంటుంది. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన శ్రీలీల పాటల్లో చూపించే గ్రేస్ ఆకట్టుకుంటుంది. భగవంత్ కేసరి చిత్రంలో కీలక రోల్ చేసి మరొక విజయం ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో బాలకృష్ణ హీరోగా నటించారు. భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 


అయితే శ్రీలీల యంగ్ హీరోలతో చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, ఆదికేశవ, స్కంద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆమెను వరుస పరాజయాలు వెంటాడాయి. దాంతో కొంచెం స్పీడ్ తగ్గించింది. ఆచితూచి సినిమాలు ఎంచుకుంటుంది. మెడిసిన్ చదువుతున్న శ్రీలీల సినిమాలకు గ్యాప్ ఇచ్చి స్టడీస్ మీద ఫోకస్ పెట్టినట్లు సమాచారం. 

Sreeleela

కాగా శ్రీలీలకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక వస్తువు ఖచ్చితంగా తన హ్యాండ్ బ్యాగ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుందట. సాధారణంగా ప్రతి అమ్మాయి హ్యాండ్ బ్యాంగ్ లో మొబైల్, ఎయిర్ పాడ్స్, మేకప్ కిట్, ఇతర అత్యవసర సామాగ్రి ఉంటాయి. శ్రీలీల వీటితో పాటు అమ్మవారి కుంకుమ క్యారీ చేస్తుందట. తాను ఎక్కడికి వెళ్లినా అమ్మవారి కుంకుమ హ్యాండ్ బ్యాంగ్ లో ఉండాల్సిందేనట. 

అమ్మవారి భక్తురాలైన శ్రీలీల ఆ కుంకుమ తనతో ఉండటం ద్వారా రక్షణ కలుగుతుంది. మంచి జరుగుతుందని భావిస్తోందట. ప్రస్తుతం శ్రీలీల పవన్ కళ్యాణ్ కి జంటగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తుంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నితిన్ కాంబోలో రాబిన్ హుడ్ చేస్తుంది. అలాగే రవితేజతో ఒక చిత్రానికి సైన్ చేసింది. 

Latest Videos

click me!