సినిమా హిట్ అయితే అందులో నటించిన నటీనటులు, టెక్నీషియన్ల జీవితాలు మారిపోతాయి. హీరోహీరోయిన్ల కెరీర్‌లపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. సినిమా హిట్ అయితే ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోతారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో చాలా మంది హీరోయిన్లు, హీరోలు ఇలానే ఓవర్‌నైట్‌లో స్టార్స్ అయిపోయారు.
కట్ చేస్తే ఆ తర్వాత అన్నీ ఫ్లాప్ సినిమాలే పడటంతో ఫేడౌట్ అయ్యే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఓ హీరోయిన్ ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల హీరోయిన్ అనిపించింది. తర్వాత వరుసగా ఫెయిల్యూర్స్ చవిచూసింది. మరి ఆమె ఎవరు? ఆ కథేంటో చూద్దాం.
మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరోయిన్ కృతి శెట్టి. `ఉప్పెన` సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన విషయం తెలిసిందే. మెగా హీరో వైష్ణవ తేజ్ కూడా ఈ మూవీతోనే హీరోగా పరిచయం అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సైతం దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఇలా అంతా కొత్తవాళ్లు కలిసి చేసిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నెగటివ్ రోల్‌ని పోషించడం విశేషం. ఈ సినిమా కరోనా సమయంలోనే విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వంద కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసింది. ముగ్గురిని స్టార్స్ చేసింది. హీరో, హీరోయిన్, దర్శకుడు సక్సెస్ అయ్యారు.
అయితే కృతిశెట్టికి ఆ తర్వాత వరుసగా హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చాయి. ఒకేసారి సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో తాను కూడా ఓకే చెప్పింది. పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ లంటే ఎవరు మాత్రం నో చెబుతారు. కృతి శెట్టి అదే చేసింది. కానీ ఆ తర్వాత సినిమాలన్నీ నిరాశ పరిచింది. నానితో చేసిన `శ్యామ్ సింగరాయ్` యావరేజ్‌గా ఆడింది. నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` కూడా యావరేజ్‌గా ఆడింది.
read more: Thandel Day 1 Collections: దుమ్మురేపుతున్న `తండేల్` కలెక్షన్లు.. నాగచైతన్య కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ?
వీటితోపాటు `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `కస్టడీ`, `ఏఆర్‌ఎం`, `మనమే` వంటి సినిమాల్లో నటించినా అన్నీ పరాజయం చెందాయి. దీంతో ఇప్పుడు ఈ భామకి తెలుగులో ఆఫర్లే లేవు. దీంతో సౌత్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అక్కడైనా హీరోయిన్‌గా సక్సెస్ అవుతుందా? అనేది చూడాలి.
read more: నన్ను క్రిమినల్ లాగా చూస్తున్నారు.. సమంతతో విడాకులపై నాగచైతన్య సంచలన స్టేట్‌మెంట్
also read: వెంకటేష్ మూవీ వల్ల నటి కెరీర్ నాశనం ?.. ఫుల్ ఫామ్ లో ఉన్న టైంలో, మొత్తం చేసింది దర్శకుడే