'డాకు మహారాజ్' ఓటీటీ రిలీజ్ పై నెట్ ప్లిక్స్ సైలెన్స్,ఎందుకని?

Published : Feb 08, 2025, 12:42 PM ISTUpdated : Feb 08, 2025, 12:45 PM IST

Daaku Maharaaj :నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత OTTలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

PREV
13
'డాకు మహారాజ్' ఓటీటీ రిలీజ్ పై నెట్ ప్లిక్స్ సైలెన్స్,ఎందుకని?
Nandamuri Balakrishna, Daaku Maharaaj,OTT Release Date


   
థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన  యాక్షన్ ఎంటర్ టైనర్ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం నెల పూర్తవటంతో ఓటీటీలోకి వస్తుందని లెక్కలు వేసారు. డాకు మహారాజ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించి నట్లు సమాచారం .

 తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్ మీడియాల్లో క్రేజీ టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే డాకు మహారాజ్ ఓటీటీలోకి  ఫిబ్రవరి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై  ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు. నెట్ ప్లిక్స్ చడీ చప్పుడు లేకుండా సైలెంట్  గా ఉంది. దాంతో అభిమానులు షాక్ అవుతున్నారు. 

23


బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.బాలయ్య బాబు మాస్ యాక్షన్ చూసి నందమూరి అభిమానులతో పాటు అశేష ప్రేక్షకలోకం పూనకాలెత్తిపోయారు. భారీ రేంజ్ వసూళ్లు రాబడుతూ పలు రికార్డులు తిరగరాస్తుందనున్నారు. కానీ ఈ సినిమా యావరేజ్ గా సెటిల్ అయ్యింది.

సంక్రాంతి అయ్యాక ఈ సినిమా గురించి మాట్లాడేవాళ్లు లేరు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ సక్సెస్ హోరులో మిగతావేమీ వినిపించలేదు. దాంతో అప్పుడు ఈ సినిమా చూడనివారంతా ఇప్పుడు ఎప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతోందా అని ఎదురుచూస్తున్నారు.ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ డాకు మహారాజ్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ డీల్ జరిగినట్లు సమాచారం.  

33
Nandamuri Balakrishnas Daaku Maharaajs ott update out

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని ప్రకటన చేసారు. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ డైరెక్షన్, తమన్ బీజీఎమ్ ఈ సినమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

Read more Photos on
click me!

Recommended Stories