పవన్ ని అడ్డం పెట్టి ఉపేంద్రపై ట్రోల్స్, స్పందించిన ఉపేంద్ర

Published : Jun 08, 2024, 08:39 AM IST

 పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. దాదాపుగా అన్నిచోట్లా జనసేన అభ్యర్థులు బంపర్ ....

PREV
110
 పవన్ ని అడ్డం పెట్టి ఉపేంద్రపై  ట్రోల్స్,  స్పందించిన ఉపేంద్ర
pawan, upendra


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పోటీ చేసిన అన్నిస్థానాల్లో జనసేన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసింది. ఇక పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించింది. దాదాపుగా అన్నిచోట్లా జనసేన అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏకంగా 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. భీమవరంలో ఆ పార్టీ అభ్యర్థి పులపర్తి అంజి 66 వేల మెజారిటీతో గెలిచారు. ఈ విజయం గురించి దేశం మొత్తం మాట్లాడుతోంది. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని చూపెడుతూ ఉపేంద్రను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయమై ఉపేంద్ర స్పందించారు. 

210
pawan


ఇక విలక్షణమైన సినిమాలతో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. మొదటి నుంచి ఉపేంద్ర రాజకీయాల్లోకి వస్తా అని చెబుతూ వచ్చారు. మొత్తానికి  ఆ మధ్య 2017లో  తన కొత్త పార్టీని అనౌన్స్ చేశారు.  కర్నాటక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చెసింది కూడా.  కర్నాటక ప్రజ్ఞవంత జనతా పక్ష (కేపీజెపీ) ఆ పార్టీ పేరు.  అక్కడ అధికార పార్టీ మీద ఉన్న ప్రజావ్యతిరేకతను ఆసరాగా చేస్కుని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేసారు. కానీ పని కాలేదు. జనం ఉపేంద్ర పార్టీని సీరియస్ గా తీసుకోలేదు.  ఈ క్రమంలో ఉపేంద్ర  పార్టీ సినిమా భాషలో చెప్పాలంటే డిజాస్టర్ అయ్యింది. 

310
Pawan Kalyan


ఆ పార్టీ నుంచి అతి తక్కువ రోజుల్లోనే ఉపేంద్ర బయటకు వచ్చాడు! తను స్థాపించిన పార్టీకి తనే రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఉప్పీ. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేంద్ర పార్టీ పోటీ చేయలేకపోయింది. ఆ తర్వాత ఉపేంద్ర మరో రాజకీయ పార్టీని స్థాపించారు. దాన్ని ఈ సారి పోటీలో పెట్టడం ఖాయమని ఇది వరకే ప్రకటించారు. ఆ మేరకు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఉపేంద్ర పార్టీ కొన్ని స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించింది.
 

410


అప్పటికీ పేద ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని,తన పార్టీ ఆ దిశగానే పని చేస్తుందని ఉపేంద్ర ప్రకటించారు. ఇది తన పార్టీ కాదని, ప్రజల పార్టీ అని చెప్పారు. ప్రజల కోసం తాను ఒక వేదికను మాత్రమే సిద్ధం చేశానని... తన అభిప్రాయాలతో ఏకీభవించేవారంతా పార్టీలో భాగస్వాములు కావచ్చని స్పష్టం చేశారు. సమాజంలో మార్పును తీసుకురావడమే తన కల అని, రైతులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
 

510


 రాజకీయాల్లో ధనం ప్రభావం బాగా పెరిగిపోయిందని... దాన్ని అంతం చేయడానికి శాయశక్తులా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు ఉన్నత విద్యావంతులై ఉంటేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ఉపేంద్ర భార్య ప్రియాంక కూడా హాజరయ్యారు. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా అందరూ ఖాకీ దుస్తులు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే జనం వాటిని సినిమా షూటింగ్ లాగానే చూసారు కానీ ఓట్ల  రూపంలో స్పందించింది లేదు. 

610


 ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, అన్నింటా విజయం సాధించింది. దీంతో పవన్‌ కల్యాణ్‌తో ఉపేంద్రను పోలుస్తూ సోషల్‌ మీడియాలో పలువురు ట్రోల్‌ చేస్తున్నారు. ఉపేంద్ర ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ని ఏర్పాటు చేసి పోటీ చేసినా ఒక్కచోటా గెలవలేకపోయారు. దీంతో పవన్ కళ్యాణ్ తో పోలుస్తూ  ఆయనపై ట్రోల్స్‌ పెరిగాయి. 

710


ఈ నేపథ్యంలో శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా ఉపేంద్ర స్పందించారు. తన గెలుపోటముల గురించి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నానని, తాను గెలవాలనుకున్నప్పుడు ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి విజయం సాధిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ పార్టీ ‘ప్రజాకీయ’ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  నన్ను మేథావి అంటూ ఇకపై ఎవరూ ట్రోల్‌ చేయకండి’ అని ఉపేంద్ర అన్నారు. 

810
pawan


ఉపేంద్ర(Upendra)  ఉత్తమ ప్రజాకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆటో చిహ్నం కేటాయించింది. ఉపేంద్ర గతంలోనే ఉత్తమ ప్రజాకీయపార్టీ పేరిట రాష్ట్రమంతటా పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే పార్టీతో పోటీ చేశారు. అయితే అప్పట్లో గుర్తు ఖరారు కాలేదు. 2018 నుంచే ప్రత్యేక సిద్ధాంతాలతో రాజకీయ పార్టీని కొనసాగిస్తున్నారు. అభ్యర్థిగా పోటీ చేయదలచుకున్నవారు నియోజకవర్గ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను అన్వేషించేలాంటి వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. ఆటో డ్రైవర్లంటే ఎనలేని అభిమానం చూపిన దివంగత నటుడు శంకర్‌నాగ్‌కు ఆటో రిక్షా గుర్తును అంకితం చేస్తానన్నారు. అయినా ఎవరు గెలిపించలేదు.

910


ఉపేంద్రకు కర్ణాటకలో ఫ్యాన్ ఫాలోయింగ్ కొంత వరకూ ఉంది కానీ..అది రాజకీయంగా పనికి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇది వరకూ కర్ణాటకలో ఇలా హీరోలు ప్రాంతీయ పార్టీలు పెట్టేసి రాణించిన దాఖాలు లేవు. అంబరీష్ వంటి స్టార్ హీరో కూడా.. కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయంగా కొంత రాణించారు. మండ్య ప్రాంతంలో తన సామాజికవర్గం సమీకరణాలు అనుకూలంగా ఉండటంతో అక్కడ అంబరీష్ రాణించగలిగారు .

1010


ఇదిలా ఉంటే  కన్నడ సూపర్‌స్టార్‌ ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో ‘ఏ’ కు ప్రత్యేక స్థానం ఉంది. 26 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఓ కల్ట్‌ ఫిల్మ్‌గా నిలిచింది. ఎన్నో రికార్డులు నెలకొల్పింది. త్వరలో ఈచిత్రం మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉప్పి క్రియేషన్స్‌, చందు ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్లపై ‘ఏ’ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 21న ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నట్లు నిర్మాత లింగం యాదవ్‌ తెలిపారు. ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు.

Read more Photos on
click me!

Recommended Stories